వినేందుకు విచిత్రంగా వినిపించినా.. లోతుగా చూస్తే.. ఈ మాట నిజమనిపించకమానదు. దాయాది జట్టు మీద క్రికెట్ మ్యాచ్ అంటే చాలు.. భావోద్వేగాలు పీక్స్ కు వెళ్లిపోయే పరిస్థితి. వంద కోట్లకు పైగా ఆకాంక్షను తీర్చటం ఎంత ఒత్తిడితో కూడుకున్న పనో.. టీవీలో లైవ్ చూసిన ప్రతి ఒక్కరి కంటికి కనిపించింది. చెమటలు దిగ కారిపోతున్నా వాటినే మాత్రం పట్టించుకోకుండా.. అలసటను పక్కన పెట్టి.. విజయమే లక్ష్యంగా.. గెలుపే ధ్యేయంగా ఆడిన టీమిండియా ఆటగాళ్లు ఆటతో భారత్ మరోసారి పాకిస్థాన్ మీద విజయం సాధించింది.
గెలవటం.. ఓడటం లాంటివి ఆటలో మామూలే అయినా.. పాక్ మీద గెలుపు ఆ కిక్కే వేరబ్బా అనుకునే వాళ్లే ఎక్కువ. మరికొందరైతే.. టోర్నీ చేజిక్కించుకోకున్నా ఫర్లేదు పాక్ మీద విజయం సాధిస్తే చాలన్న విపరీతపు మాటను చెప్పేస్తుంటారు. ఇందుకు తగ్గట్లే వరల్డ్ కప్ టోర్నీలో పాక్ మీద భారత్ జట్టు ఏ దేశంలో అయినా.. ఏ ప్రాంతంలో మ్యాచ్ జరిగినా విజయం మాత్రం టీమిండియాదేనన్న సంప్రదాయం మరోసారి కంటిన్యూ అయ్యింది. వరల్డ్ కప్ సందర్భంగా పాక్ తో టీమిండియా ఢీ కొన్న 11 సార్లు విజయాన్ని సొంతం చేసుకోవటం గమనార్హం.
పెద్దగా అచ్చి రాని ఈడెన్ మైదానంలో దాయాదితో పోరు అన్నప్పుడు కొద్దిగా మనసు శంకించినా.. ప్రపంచకప్ టోర్నీల్లో గెలుపు సెంటిమెంట్ పలువురు అభిమానుల్ని ఉరడించింది. దీనికి తగ్గట్లే మ్యాచ్ విజయంతో మరోసారి సెంటిమెంట్ గెలిచిన పరిస్థితి. ఏమాటకు ఆ మాటే పాక్ తో మ్యాచ్ అంటే టన్నుల కొద్దీ ఒత్తిడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా.. వాటిని తట్టుకొని విజయాన్ని సాధించి కోట్లాదిమంది భారతీయులకు అంతులేని ఆనందాన్ని టీమిండియా జట్టు ఇస్తుందని చెప్పాలి. అందుకు వారికి అభినందనలు చెప్పటం ధర్మం.