భారత మహిళా క్రికెట్ జట్టు తొలి సారి టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ ను చేరింది. ఆస్ట్రేలియాలో జరగుతున్న విమెన్స్ క్రికెట్ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు అదరగొట్టే ప్రదర్శనతో ముందుకు వెళ్తూ ఉంది. ఇంగ్లండ్ తో జరిగిన సెమిఫైనల్ మ్యాచ్ పూర్తి గా రద్దు కావడంతో... టీమిండియా ఫైనల్ లోకి ఎంటరయ్యింది. లీగ్ దశల్లో భారత జట్టు అజేయంగా నిలిచింది. దీంతో సెమిస్ మ్యాచ్ పూర్తిగా వర్షార్పణం అయినప్పటికీ... మెరుగైన పాయింట్లతో ఇండియా ఫైనల్ ను చేరింది.
భారత మహిళా జట్టు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ను చేరడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. ఇది వరకూ భారత మహిళా జట్టు రెండు సార్లు సెమిస్ వరకూ వెళ్లింది. ఆ మ్యాచ్ లలో ఓటమి పాలై ఇంటి ముఖం పట్టింది. ఇప్పుడు సెమిస్ ను దాటి ఫైనల్ ను రీచ్ అయ్యింది.
సెమీ ఫైనల్ మ్యాచ్ కు వర్షం గండం ఉందనే వార్తలు ముందే వచ్చాయి. అయితే మ్యాచ్ రద్దు అయితే... రిజర్వ్ డే లేదు. ఈ మేరకు ఐసీసీ ప్రకటన చేసింది. మ్యాచ్ రద్దు అయితే పాయింట్ల వారీగా జట్టు ఫైనల్ కు చేరతాయని ఐసీసీ ప్రకటన చేసింది. ఈ క్రమంలో లీగ్ దశలో వరస విజయాలు సాధించడం టీమిండియాకు ప్లస్ పాయింట్ అయ్యింది. లీగ్ మ్యాచ్ లలో ఇంగ్లండ్ కన్నా భారత జట్టు ప్రదర్శన మెరుగ్గా ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది ఇండియా జట్టు. ఈ నేపథ్యంలో సెమిస్ మ్యాచ్ ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దు అయినప్పటికీ... ఇండియా ఫైనల్ కు రీచ్ అయ్యింది.
వరల్డ్ కప్ రెండో సెమిస్ ఆస్ట్రేలియా, దక్షిఫ్రికాల నడుమ జరగనుంది. ఆ మ్యాచ్ లో విజేతతో ఇండియా ఫైనల్ లో తలపడనుంది. ఆ మ్యాచ్ కు కూడా వర్షం ఆటంకం ఉందని సమాచారం. ఒకవేళ ఆ మ్యాచ్ రద్దు అయితే దక్షిణాప్రికా పాయింట్ల వారీగా ప్రపంచకప్ ఫైనల్ ను చేరుతుంది.