అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు ఆడబిడ్డ చిక్కుల్లో పడింది. అయితే, ప్రస్తుతం చోటుచేసుంటున్న విద్యార్థుల అరెస్టు వంటి ఉదంతంలో కాదు. తన స్వయంకృతాపరాదంతో ఆమె కటకటాల పాలైంది. ప్రియుడితో కలిసి ఓ హత్యకు ప్లాన్ వేసి ఆమె ఊచలు లెక్కపెడుతోంది. ఇంతకీ ఆమె హత్యచేసేందుకు సహకరించింది ఎవరి విషయంలో అంటే...ప్రియుడి భార్య విషయంలో - షాకింగ్ గా ఉన్న ఈ ఉదంతాన్ని అమెరికన్ పోలీసులు మరింత ట్విస్టులతో చేధించారు. భారత సంతతి అమెరికన్ తన ప్రియురాలితో కలిసి మాజీ భార్య హత్యకు పన్నిన కుట్ర భగ్నమైంది. కిరాయి హంతకుడిగా పోలీసు వచ్చాడని తెలియక తన కుతంత్రాన్నంతా చెప్పి కటకటాలపాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే....అమెరికన్ ఇండియన్ నర్సన్ (55)కు 1995లో వివాహమైంది. వారికో కొడుకు - కూతురు ఉన్నారు. నర్సన్ 2011లో భార్యతో గొడవపడి విడిపోయాడు. ఆస్తి పంపకాల్లో ఏకాభిప్రాయం రాక విడాకుల కేసు పెండింగ్ లో ఉంది. గతేడాది మే నెలలో వేరే కేసులో నర్సన్ మిడిల్ సెక్స్ కౌంటీ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మరో ఖైదీని పరిచయం చేసుకొని తన భార్య హత్యకు ఒక కిరాయి హంతకుడిని చూపెట్టమన్నాడు. దీంతో సదరు తోటి ఖైది సరేనన్నాడు. నర్సన్ గత ఆగస్టులో పోలీసు కస్టడీ నుంచి బయటకొచ్చాక ప్రియురాలు సంధ్యారెడ్డి (52)తో కలిసి తన భార్య హత్య ప్లాన్ వేగవంతం చేశారు. న్యూజెర్సీలోని ఓ షాపింగ్ మాల్ వద్ద హంతకుడిగా వచ్చిన పోలీసుతో కలిసి నర్సన్ - ఆయన ప్రియురాలు కలిసి పథకం రచించారు. 5000-10 వేల డాలర్లకు బేరం కుదిరింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది.
భార్య హత్యకు ప్లాన్ చేస్తున్న వ్యక్తిని - ఆయన ప్రియురాలి వ్యవహారాన్ని వారికి తెలియకుండా పోలీసు వీడియో తీశాడు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వెంటనే నర్సన్ - సంధ్యారెడ్డిని అరెస్టు చేశారు. గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కాగా, ఆకర్షణ వలలలో పడి తెలుగు మహిళ కటకటాల పాలైందని చర్చించుకుంటున్నారు.