భారత్ పైకి ఉగ్రవాదులను పాకిస్తాన్ ఎగదోస్తుందనడానికి పక్కా ఆధారాలు లభించాయి. పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదులకు శిక్షణ ఇప్పించి కశ్మీర్ లోయలో అల్లకల్లోలం చేయడానికి కుట్రలు పన్నుతోందని తేటతెల్లమైంది. తాజాగా భారత సైన్యం సరిహద్దు వద్ద పట్టుకున్న ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ఆ వీడియోలను విడుదల చేసిన భారత ఆర్మీ అధికారులు మీడియా సాక్షిగా పాకిస్తాన్ బండారాన్ని బయటపెట్టారు.
తాజాగా ఎల్వోసి వద్ద ఇద్దరు ఉగ్రవాదులను భారత్ సైన్యం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పాకిస్తాన్ లోని రావల్పిండికి చెందిన నజ్నీన్ కోఖర్ - ఖలీల్ అహ్మద్ లు పాకిస్తాన్ లోని కచెర్బన్ వద్ద వారం పాటు శిక్షణ పొందినట్టు విచారణలో తెలిపారు. వారు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తారని.. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులే ఈ సంస్థను తమను కశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించడానికి పంపించారని ఆ ఇద్దరు ఉగ్రవాదులు సంచలన విషయాలు వెల్లడించారు.
ఇద్దరు ఉగ్రవాదులు నాలుగు సంవత్సరాలుగా భారత సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్నామని భారత ఆర్మీ విచారణలో తెలిపారు. జమ్మూకశ్మీర్ లో దాడి చేయడానికే మాకు ప్రణాళికలు ఉన్నాయి.. లోయలో శాంతిని భగ్నం చేయలన్నదే తమ లక్ష్యమన్నారు. లోయలో కొద్దికాలంగా ఉగ్రవాద చర్యలు లేకపోవడంతో పాకిస్తాన్ నిరాశగా ఉందని.. అందుకే తమను పంపించిందని విచారణలో వారు వెల్లడించారు.
ఇప్పటికే భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కశ్మీర్ లోయలో శాంతిని విచ్చిన్నం చేయడానికి పాకిస్తాన్ కుట్ర చేస్తోందని భారత సైన్యాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడడం.. పాకిస్తాన్ కుట్రను బయటపెట్టడం అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇరుక్కుపోయింది. ఉగ్రవాదాన్ని పోత్రహిస్తుందనడానికి ఈ ఇద్దరు ఉగ్రవాదులే సాక్ష్యం అని భారత్ చెబుతోంది. దీనిపై పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.