భార‌త ప్ర‌తీకార దాడుల‌తో కాళ్ల బేరానికి పాక్

Update: 2018-05-21 06:26 GMT
స‌హ‌నాన్ని చేత‌కానిత‌నంగా ఎప్పుడూ భావించ‌కూడ‌దు. అదే చేస్తే.. అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. తాజాగా అలాంటి అనుభ‌వ‌మే దాయాది దేశ‌మైన పాకిస్థాన్ కు ఎదురైంది. గ‌డిచిన రెండేళ్లుగా అదే ప‌నిగా కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ తీరు భార‌త్ స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారింది.

ఈ ఏడాదిలో గ‌డిచిన నాలుగు నెల‌ల్లో దాదాపు 700సార్లు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ తీరు కార‌ణంగా ప‌లువురు జ‌వాన్లు.. సాధార‌ణ పౌరులు మ‌ర‌ణించారు. రెండు రోజుల క్రితం జ‌రిపిన దాడుల‌కు ఇద్ద‌రు బీఎస్ ఎఫ్ జ‌వాన్లు.. ఐదుగురు జ‌మ్ము పౌరులు మ‌ర‌ణించారు.

అదే ప‌నిగా క‌వ్వించే చ‌ర్య‌ల‌తో భార‌త్ నుఇబ్బంది పెడుతున్న వైనంపై తాజాగా భార‌త ఆర్మీ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. త‌మ‌తో పెట్టుకుంటే ప‌రిణామాలు ఎంత దారుణంగా ఉంటాయ‌న్న విష‌యాన్ని తెలియ‌జేయాల‌ని భావించిన భార‌త ఆర్మీ.. పాక్ ఆక్ర‌మ స్థావ‌రాల‌పైన ఎదురుదాడుల‌కు దిగింది.

జ‌మ్ముక‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల్లో ఉన్న పాక్ బంక‌ర్ల‌పై రాకెట్ల‌తో దాడికి దిగింది. కాల్పుల‌తో విభృంభించింది. దీంతో.. పాక్ వ‌ణికింది. ఉక్పాక్ బంక‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని భార‌త భ‌ద్ర‌తాద‌ళాలు చేస్తున్న ఫైరింగ్ తో  ఉక్కిరిబిక్కిరి అయిన దాయాది.. భార‌త్ తో కాళ్ల బేరానికి వ‌చ్చింది. కాల్పులు విర‌మించాల‌ని.. తాము పిచ్చ వేషాలు వేయ‌మ‌న్న మాట‌ను భార‌త ఆర్మీ ఉన్న‌తాధికారుల‌కు సందేశాన్ని పంపిన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. భార‌త్ మౌనాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా చెబుతున్నారు.

తాజాగా పాక్ పై భార‌త సైన్యం విరుచుకుప‌డిన వైనాన్ని మీడియాకు వెల్ల‌డించారు. రెండేళ్లుగా పాక్ సైన్యం దుశ్చ‌ర్య‌ల్ని తాము స‌హ‌నంతో భ‌రించామ‌ని.. అయిన‌ప్ప‌టికీ అంత‌కంత‌కూ ఇబ్బంది పెడుతున్న దాయాది తీరుతో విసుగెత్తి.. ప్ర‌తీకార దాడుల‌కు దిగినట్లుగా ఆర్మీ ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. మూర్ఖుడికి మూర్ఖంగా స‌మాధానం ఇస్తే త‌ప్పించి.. విష‌యం అర్థం కాదేమో?
Tags:    

Similar News