కంపెనీలు పెట్టేసి.. అరకొర ఆస్తుల్ని చూపించి.. వందలాది కోట్ల రూపాయిల్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం.. ఆ తర్వాత చేతులు ఎత్తేసే బాపతు ఎప్పటినుంచో వస్తున్నదే. ఇప్పుడా జాబితాలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేరినట్లేనని చెప్పక తప్పదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మంత్రి గంటా ఆస్తుల వేలం వార్త.. ఇప్పుడు మరింత సంచలనంగా మారనుంది. ప్రత్యూష కంపెనీ పేరిట ఏర్పాట్లు చేసిన సంస్థకు హామీదారుగా వ్యవహరించిన ఏపీ మంత్రి గంటా ఆస్తుల్ని బ్యాంకులు స్వాధీనం చేసుకొని ఏక్షణంలో అయినా.. వేలం నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బ్యాంకు వద్ద తనఖా పెట్టిన ప్రత్యూష డైరెక్టర్లు.. హామీదారుగా వ్యవహరించిన గంటా ఆస్తులు మొత్తాన్ని వేలం వేసినా.. బహిరంగ మార్కెట్లో రూ.80 నుంచి రూ.100 కోట్లకు మించి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. విశాఖలోని డాబాగార్డెన్స్ బ్రాంచ్ గా ఉన్న ఇండియన్ బ్యాంకు మొయిన్ బ్రాంచ్ నుంచి ప్రత్యూష రిసోర్సెస్.. ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట తీసుకున్న రుణానికి వడ్డీ మొత్తం కలిపితే ఇప్పుడు రూ.196 కోట్లు ఉన్న విషయం తెలిసిందే.
అయితే.. బ్యాంకు వద్ద తీసుకున్న అప్పునకు ప్రతిగా తనఖా పెట్టిన ఆస్తుల మొత్తం విలువకు.. ఉన్న బాకీకి మధ్య వ్యత్యాసం తక్కువలో తక్కువ రూ.100 కోట్లు ఉండటంతో.. ఇంత భారీ వ్యత్యాసంతో బ్యాంకు ఎలా అప్పు ఇచ్చిందన్నసందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన దగ్గర తనఖా పెట్టిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్న బ్యాంకు.. వాటిని ఏ క్షణంలో అయినా వేలం పెట్టొచ్చని చెబుతున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే.. బ్యాంకు స్వాధీన ప్రకటనను వెల్లడించిన నేపథ్యంలో.. వేలం కానీ వేస్తే.. ఎంత మొత్తం వస్తుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కుంగిన స్థిరాస్తుల విలువ కూడా బ్యాంకుపై భారం మోపుతుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్ లో గంటా ఆస్తుల విలువకు.. బ్యాంకు నుంచి తీసుకున్నఅప్పునకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువన్న భావన వ్యక్తమవుతోంది. గంటా అండ్ కో ఆస్తుల్ని(బ్యాంకుకు తనఖా పెట్టినవి మాత్రమే) స్వాధీనం చేసుకొని.. వేలం వేసే విషయంలో పత్రికా ప్రకటన ఇచ్చిన బ్యాంకు అధికారులు.. ఇప్పుడీ విషయం మీద పెదవి విప్పే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉన్నతస్థాయిలో వచ్చిన ఆదేశాలతో.. ఈ వ్యవహారంపై చాలామంది నోరు విప్పేందుకు ఇష్టపడకపోవటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/