ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో మరోసారి మన భారతీయుడు మెరిసాడు. గోవా కు చెందిన లియోన్ లూక్ మెన్డోంకా అనే 14 ఏళ్ల బాలుడు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో నెగ్గి గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. ఇటలీ లో జరిగిన టోర్నమెంట్లో లియోన్ లూక్ మెన్డోంకా తన చివరి ఆట నెగ్గి గ్రాండ్ మాస్టర్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఇది భారతదేశానికి చెందిన వ్యక్తికి దక్కిన 67వ గ్రాండ్ మాస్టర్ టైటిల్.
కాగా, లియోన్ కేవలం 14 సంవత్సరాల, 9 నెలల, 17 రోజుల వయస్సులో ఉండగానే ఈ అరుదైన టైటిల్ ను కైవసం చేసుకోవడం విశేషం. దీంతో గోవా నుండి గ్రాండ్ మాస్టర్ టైటిల్ దక్కించుకున్న రెండో ఆటగాడిగా లియోన్ లూక్ మెన్డోంకా రికార్డుకెక్కాడు. 2020 అక్టోబరులో ఇటలీలో జరిగిన రిగో చెస్ GMRR టోర్నమెంట్లో లియోన్ తన మొదటి విజయాన్ని నమోదు చేయగా, బుడాపెస్ట్ లో జరిగిన టోర్నమెంట్లో విజయం సాధించి కేవలం 21 రోజుల్లోనే రెండవ మ్యాచ్ నెగ్గాడు. ఇటలీలో కరోనా వైరస్వి జృంభిస్తుండంతో టోర్నమెంట్ జరిగిన 9 నెలల పాటు లియోన్ లూక్ మెన్డోంకా, అతని తండ్రి అద్దె వసతి గృహాలలోనే నివసించారు. అక్కడే తన కోచ్ జిఎం విష్ణు ప్రసన్న ద్వారా లియోన్ లూక్ మెన్డోంకా శిక్షణ తీసుకున్నాడు.
14 ఏళ్ల 9 నెలల 17 రోజుల వయసులో మెండోన్కా భారత 67వ చెస్ గ్రాండ్ మాస్టర్‌గా రికార్డులకెక్కాడు. దీనిపై లియోన్ లూక్ మెన్డోంకా మాట్లాడుతూ.. “ నేను గ్రాండ్ మాస్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ టైటిల్ సాధించడానికి అహర్నిశలు కష్టపడ్డా. నేను ఈ టైటిట్ను సాధించడానికి సపోర్ట్ ఇచ్చిన నా తల్లిదండ్రులకు, కోచ్ విష్ణు ప్రసన్నకు, స్పాన్సర్లతో సహా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అన్నాడు.