ఓ బైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అక్షరాల పది కోట్ల రూపాయల విలువ చేసే బండి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, దీని వెనుక అసలు కథ కచ్చితంగా తెలియకపోయినా ఎవరికి తోచినట్లు వారు దానిపై కథలు అల్లేస్తున్నారు. రాజస్థాన్ లోని సికార్ నియోజకవర్గ ఎమ్మెల్యే రతన్ సింగ్ జలధరి దాన్ని తన కుమారుడికి గిఫ్టుగా ఇచ్చారని కొందరు చెబుతుంటే.. కాదు కాదు.. మహారాష్ట్రలోని విరార్ నియోజకవర్గ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకుర్ దాన్ని తన కుమారుడు ఉత్తుంగ్ ఠాకుర్ కు ఇచ్చారని మరికొందరు చెబుతున్నారు.
దీన్ని రిజిస్ట్రేషన్ కోసం తీసుకెళ్లారని కొన్ని ఛానళ్లలో ప్రసారమవుతోంది. అయితే.. రాజస్థాన్ లోని రవాణా శాఖ వర్గాలు మాత్రం అలాంటి వాహనమేదీ తమ వద్దకు రిజిష్ట్రేషన్ కోసం రాలేదని చెబుతున్నారు. దీంతో ఈ బండి అసలు యజమాని ఎవరన్నది ఇంకా తేలలేదు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇండియా కంపెనీకి చెందిన ఈ వాహనం ఫొటో మాత్రం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఆ చిత్రాల ప్రకారం అది ఇండియన్ చీఫ్ క్లాసిక్ బైక్ అని తెలుస్తోంది. ఈ మోడల్ ఇప్పటికే ఇండియాలో దొరుకుతోంది. ఢిల్లీలో సుమారు 30 లక్షలు - ముంబయిలో 32 లక్షల ధరకు దొరుకుతోంది. చాలాకార్లకు కూడా లేనట్లుగా 1800 సీసీ ఇంజిన్ దీని సొంతం.. 350 కేజీలకు పైగా బరువు ఉంటుంది.
కాగా ఇలాంటి బైకు ఇండియాలో కనిపించడం ఇదే తొలిసారి అన్న ప్రచారం కూడా నిజం కాదు. 1901 నుంచి బైకులను ఉత్పత్తి చేస్తున్న అమెరికాకు చెందిన ‘‘ఇండియన్’’ సంస్థ 2014 జనవరిలో తొలిసారి భారత్ లో విక్రయాలు మొదలుపెట్టింది. ఢిల్లీ, ముంబయిల్లో ఈ కంపెనీ షోరూంలు ఉన్నాయి.