మోగ్లీ పాప తల్లిదండ్రులెవరో తెలిసింది?

Update: 2017-04-21 07:33 GMT
ఇటీవల నేపాల్ సరిహద్దుల్లోని అడవుల్లో కోతులతో పాటు జీవిస్తూ చెట్ల కొట్టేవాళ్ల కంటపడిన మోగ్లీ పాప సంగతి తెలుసు కదా. ఆమెను ఆసుపత్రిలో ఉంచి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే... ఆ పాప తమ కూతురేనంటూ ఉత్తర్ ప్రదేశ్ కే చెందిన ఓ జంట  పోలీసులను ఆశ్రయించింది.
    
కోతులతో కలిసి జీవిస్తూ వాటిలాగే బతికేస్తున్న అమ్మాయిని పోలీసులు పట్టుకుని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అడవి జంతువులతో కలిసి తిరుగుతూ మాటలు ఆడడం కూడా మర్చిపోయి... జంతువుల మాదిరిగానే కాళ్లు చేతులతో నడుస్తూ పూర్తిగా కోతి లక్షణాలతో ఉన్న ఆ పాపకు వైద్యులు మానసిక చికిత్సలు కూడా అందించి మామూలు అమ్మాయిగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  
    
ఇప్పడు ఆ అమ్మాయి తమ అమ్మాయేనంటూ లక్నోకు చెందిన ఓ జంట చెబుతోంది.  2012లో పాప తప్పిపోయిందనీ, అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు చెబుతున్నారు.  మోగ్లీ గర్ల్ గా ఇప్పుడు గుర్తింపు పొందిన ఆ పాప అసలు పేరు లక్షి అని వారు చెబుతున్నారు. డీఎన్ఏ పరీక్ష నిర్వహించి ఆమెను తమకు అప్పగించాలని వారు పోలీసులను కోరుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News