అమెరికాలోని ఓహియోలో దుర్ఘటన చోటుచేసుకుంది. విమానం కుప్పకూలిన ఘనటలో తెలుగు దంపతులు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మచిలీపట్టణంకు 63 ఏళ్ల పైలట్ - ఉమామహేశ్వర్ కల్పతాపు మరియు అతని 61 ఏళ్ల భార్య సీతాగీత కల్పతాపు ఓహియోలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఈనెల 8వ తేదీన ఇండియానాలో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మచిలీపట్టణం కు చెందిన వీరు ఇండియానాలో సెటిల్ అయ్యారు.
కొలంబస్‌కు దక్షిణాన 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెవర్లీలోని వాషింగ్టన్ కౌంటీ గ్రామానికి సమీపంలో శనివారం లాగన్స్‌పోర్ట్, ఇండియానాకు చెందిన జంట విమానం కూలిపోయింది. పైపర్ ఆర్చర్ పీఏ -28లో ఈ ఇద్దరు దంపతులు మాత్రమే ఉన్నట్లు స్టేట్ హైవే పాట్రోల్ సోమవారం తెలిపింది. రాజ్ క్లినిక్ పేరుతో నిర్వహిస్తున్న సొంత క్లినిక్ ద్వారా ఈ దంపతులు వైద్య సేవలు అందిస్తున్నారు. శనివారం ఉదయం బయల్దేరిన వీరి విమానం దారితప్పినట్లు తేలింది. అనంతరం ఫెడరల్ ఏవియేషన్ కమిటి దర్యాప్తు చేయగా వాషింగ్టన్ సమీపంలోని ఓ కొలనులో విమానం కుప్పకూలినట్లు నిర్దారించారు. ఈ వివరాలు నిర్దారణ అయిన అనంతరం సంబంధిత వర్గాలు రంగంలోకి దిగి భార్యభర్తల శవాలను గుర్తించారు. ఈ దుర్మరణంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెళ్లడించారు.