విమానంలో తెలుగు వైద్యుడి నిర్వాకం..అరెస్టు!

Update: 2017-11-11 07:49 GMT
విమానంలో త‌న ప‌క్క సీట్లో కూర్చున్న‌ బాలిక‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఓ భార‌తీయ వైద్యుడు తాను చేసిన త‌ప్పు ప‌ట్ల ప‌శ్చాత్తాపాన్ని వ్య‌క్తం చేశాడు. ఈ ఏడాది జూలై 23న‌ జరిగిన ఆ ఘ‌ట‌న‌ను సంబంధించిన విచార‌ణ బుధ‌వారం నెవార్క్ లోని ఫెడ‌ర‌ల్ కోర్టులో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తాను చేసిన నేరాన్ని అంగీక‌రించిన ఆ వ్య‌క్తి ఫెడ‌ర‌ల్ జ‌డ్జిని క్ష‌మాప‌ణ‌లు కోరాడు. ఆ భార‌తీయ కీచ‌క డాక్ట‌ర్ నేరం అంగీక‌రించి క్ష‌మాప‌ణ‌లు కోర‌డంతో అత‌డికి అమెరికా చ‌ట్టాల ప్ర‌కారం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో....ఒక నెల నుంచి మూడు నెల‌ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డ‌నుంది.

ఈ ఏడాది జూలై 23న‌ విజ‌య్ కుమార్ క్రిష్ణ‌ప్ప అనే డాక్ట‌ర్ సియాటెల్ నుంచి న్యూయార్క్ కు విమానంలో ప్ర‌యాణిస్తున్నాడు. విమానంలో అత‌డి ప‌క్క సీట్లో కూర్చున్న ప‌ద‌హారేళ్ల బాలిక‌ నిద్ర‌పోతోంది. అదే అద‌నుగా భావించిన విజ‌య్ కుమార్‌..... ఆ బాలిక ధ‌రించిన లెగ్గిన్స్ పై నుంచి ఆమె మ‌ర్మాంగాలు - తొడ‌ల‌పై చేతులు వేశాడు. త‌న తొడ‌ల‌పై ఎవ‌రో చేయి వేసిన‌ట్లుగా గ్ర‌హించిన బాలిక మేలుకుంది. ఆ స‌మ‌యంలో విజ‌య్ కుమార్ ఏమీ తెలియ‌న‌ట్లుగా కూర్చున్నాడు. ఆ బాలిక మ‌ళ్లీ నిద్ర‌లోకి జారుకోగానే ఆమెను కౌగిలించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో, నిద్ర మేలుకున్న ఆమె విమాన సిబ్బందికి ఈ విష‌యం గురించి చెప్పి త‌న సీటును మార్చాల‌ని కోరింది.

నెవార్క్  లిబ‌ర్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాశ్ర‌యంలో విమానం దిగిన వెంట‌నే ఆ యువ‌తి ...ఈ ఘ‌ట‌న గురించి త‌న తల్లిదండ్రుల‌కు తెలిపింది. అయితే, ఆమె త‌ల్లిదండ్రులు  విమానాశ్ర‌యానికి చేరుకునేస‌రికి విజ‌య్ కుమార్ అక్క‌డ‌ నుంచి జారుకున్నాడు. ఆ ఘ‌ట‌న జ‌రిగాక కూడా యునైటెడ్ ఎయిర్ లైన్స్ సిబ్బంది స్పందించ‌లేద‌ని, వారి నిర్ల‌క్ష్యంతోనే విజ‌య్‌ అక్క‌డ నుంచి ఉడాయించాడ‌ని ఆమె త‌ల్లిదండ్రులు  ఫిర్యాదు చేశారు. ఆ విమానంలో ప్ర‌యాణికుల లిస్ట్ ను ఎఫ్ బీఐ వారు ప‌రిశీలించారు. అందులోని ఫొటోల సాయంతో విజ‌య్ కుమార్ ను ఆ బాలిక గుర్తు ప‌ట్ట‌డంతో అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసుకు సంబంధించిన విజ‌య్ ను బుధ‌వారం కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌డంతో నేరాన్ని అంగీక‌రించి క్ష‌మాప‌ణ‌లు కోరాడు.
Tags:    

Similar News