భారత్ ఆర్థిక వ్యవస్థ పై గూగుల్ మొబిలిటీ ట్రెండ్స్ ఏం చెప్తుంది ?

Update: 2020-07-10 14:30 GMT
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచంలోని ప్రతి దేశం ఆర్థిక వ్యవస్థ కూడా బాగా చితికిపోయింది. కరోనా దెబ్బకి భారత్ ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల రక్షణే ముఖ్యం అని , కరోనా ను అరికట్టడానికి ప్రపంచంలో అతిపెద్ద లాక్ డౌన్ విధించింది భారత్ ప్రభుత్వం. దాదాపు మూడు నెలల పాటు కొనసాగిన లాక్ డౌన్ ను కొనసాగించిన ప్రభుత్వం ఆ తరువాత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినడంతో ఆన్ లాక్ అంటూ మెల్లిమెల్లిగా లాక్ డౌన్ కి సడలింపులు ఇస్తూవస్తోంది. అయితే , లాక్ డౌన్ తో భారత్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది.

గూగుల్ మొబిలిటీ ట్రెండ్స్ ప్రకారం ప్రస్తుతం భారత ఎకానమీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ నివేదిక ప్రకారం... భారత ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా లాక్ డౌన్ కంటే ముందుకు చేరుకుంటున్నాయి. భారత్ లో ప్రతి రంగం పై లాక్ డౌన్ ప్రభావం చూపింది. ఆ పరిస్థితి నుండి భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నప్పటికీ పూర్తి రికవరీకి చాలా సమయం పడుతుంది అని ఈ నివేదిక లో వెల్లడించింది. రిటైల్-వినోదం, గ్రాసరీ-ఫార్మసీ, ట్రాన్సుపోర్ట్ హబ్స్, పార్కులు, వర్క్ ప్లేస్, నివాస ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు తరువాత క్రమంగా ఇంప్రూమెంట్ కనిపిస్తోంది

మార్చి 25వ తేదీన లాక్ డౌన్ విధించిన తర్వాత విద్యుత్ వినియోగం భారీగా క్షీణించింది. జూన్ నుండి క్రమంగా మెరుగు పడుతోంది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ ప్రకారం జూన్ 28తో ముగిసిన వారంతో స్వల్పంగా తగ్గింది. అయితే క్రమంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో నిరుద్యోగిత ఏకంగా 27 శాతానికి కూడా చేరుకుంది. 122 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జూలై 5తో ముగిసిన వారంతో నిరుద్యోగిత రేటు 8.9 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఇది 8.6 శాతంగా ఉంది. అంటే ఉద్యోగాలు కూడా కోలుకున్నాయి. మే నెలకంటే జూన్ నెలలో రిటైల్ స్టోర్స్‌ను సందర్శించే వారి సంఖ్య పెరిగింది. అయితే ఏడాది క్రితంతో పోలిస్తే తక్కువే ఉంది. మొత్తంగా దీన్ని బట్టి భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది కానీ , పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది అని తెలిపింది.
Tags:    

Similar News