గల్ఫ్ దేశాలకు - ఖతర్ కు మధ్య పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. దీంతో ఖతర్ లో నివసిస్తున్న 6.5 లక్షల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ నివసించే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని దోహాలోని భారత రాయబార కార్యాలయం ఒక సూచించింది. టెర్రరిజానికి ఖతర్ మద్దతు పలుకుతోందని ఆరోపిస్తూ పలు గల్ఫ్ దేశాలు ఆ దేశంతో తమ సంబంధాలను తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఖతర్ తో రవాణా సంబంధాలను కూడా తాము తెగదెంపులు చేసుకుంటున్నట్లు సౌదీ అరేబియా - యూఏఈ - బహ్రేయిన్ - ఈజిప్టు దేశాలు ప్రకటించాయి. దీంతో ఆయా దేశాల్లో పర్యటించాలనుకునే ఖతర్ లోని భారతీయులు ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాలని పేర్కొంది. ఖతర్ లోని భారతీయుల రక్షణ - భద్రత వంటి అంశాలపై ఆ దేశ అధికారిక వర్గాలతో సంప్రదింపులు చేస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది
ఇరాక్ కు వ్యతిరేకంగా 1991లో వచ్చిన గల్ఫ్ వార్ తర్వాత ఇదే అతిపెద్ద దౌత్యసంక్షోభం. 2014లో కూడా సౌదీ అరేబియా - యూఏఈ - ఈజిప్ట్ లు కూడా ఈవిధంగానే ఖతార్ పై వేటు వేశాయి. 10 నెలల తర్వాత మళ్లీ సంబంధాలు కొనసాగాయి. కొద్ది నెలలుగా ఐఎస్ వ్యవస్థాపకులను తయారుచేయడంలో ఖతర్ కీలకమైన పాత్ర పోషిస్తుండటంతో ఈ దేశాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/