అమెరికా హోమ్ ల్యాండ్ పోలీసులు జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో ఫర్మింగ్టన్ వర్సిటీలో ఇండియాకు చెందిన 129 మంది ఫేక్ వీసా కలిగి ఉన్నట్లుగా నిర్థాంచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ 129 మంది భారత విద్యార్థులు ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. తమ విద్యార్థులు మోసపోయారని - వారు చదువుకునేందుకు అక్కడకు వచ్చారని వారిపట్ల కఠినంగా వ్యవహరించకుండా వారిని వదిలేయాలని భారత విదేశాంగ శాఖ తరపున అమెరికాకు విజ్ఞప్తి అందింది.
ఈ కేసులో అరెస్ట్ అయిన 129 మంది భారతీయ విద్యార్థులపై ఇంకా క్రిమినల్ చార్జ్ షీట్ ఓపెన్ చేయలేదు. అందుకే వారిని దోషులుగా కాకుండా మరో విధంగా చూడాలని విదేశాంగ శాఖ తమ లేఖలో పేర్కొనడం జరిగింది. చాలా మంది అక్కడ పని చేస్తున్నారని - మరి కొందరు అక్కడే చదువుకుంటున్నారు. అరెస్ట్ చేసిన వారి పూర్తి వివరాలను తమకు తెలియజేయాలని లేఖలో కోరడం జరిగింది. ప్రస్తుతం వారు ఉన్న డిటెన్షన్ సెంటర్ నుండి వెంటనే వారిని వదిలేయాలని, వారిని ఎలాంటి డిపోర్ట్ చేయకుండా ఉండాలని కోరారు.
యూనివర్శిటీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా చేరారంటూ అరెస్ట్ అయిన విద్యార్థుల తరపు బందువులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ శాతం మిచిగన్ లోని కల్ హౌస్ కౌంటీ జైల్లో ఉన్నారు. భారత్ ఏర్పాటు చేసిన కౌన్సిలర్లతో ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులు మాట్లాడారని - త్వరలోనే అందరితో కూడా కౌన్సిలర్లు మాట్లాడతారని తెలుస్తోంది. యూనివర్శిటీలో పూర్తి స్థాయి కోర్సులో విద్యార్థులు పేర్లను నమోదు చేసుకోక పోవడం వల్లే అరెస్ట్ అయినట్లుగా అక్కడ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో ఉన్నత స్థాయి విచారణ జరుగుతుంది. మద్యవర్తులుగా వ్యవహరించిన 8 మంది విచారణ మొదలు కాగా, త్వరలోనే విద్యార్థులను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన మరింతగా పెరగుతోంది. ఇండియా విదేశాంగ శాఖ పంపిన లేఖకు అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.