పెద్ద నోట్ల రద్దు వ్యవహారం దేశంలోని ప్రజలనే కాదు.. దేశం వెలుపల ఇతర దేశాల్లో ఉన్న భారతీయులనూ కష్టాల్లోకి నెట్టేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజిల్లో భారత్ నోట్లను తీసుకోవడం లేదు. దీంతో సుమారు 1400 కోట్ల ఇండియన్ కరెన్సీకి దెబ్బ పడినట్లు సమాచారం.
గల్ఫ్ లో ఉంటూ సంవత్సరానికి ఒకసారో - రెండుసార్లో ఇండియాకు వచ్చీపోయే వారు తమ చేతిలో కొంత ఇండియన్ కరెన్సీ ఉంచుకుంటారు. గల్ఫ్ దేశాల్లోని 70 లక్షల మంది ఉంటారు. వారిలో ఒక్కొక్కరి వద్ద రూ. 2 వేలు ఉన్నాయని అనుకున్నా మొత్తం రూ. 1,400 కోట్లవుతుంది.
2 వేలను మార్చుకోవడానికి ఎవరూ ఇండియాకు రాలేరు. అలాగని అరబ్ దేశాల్లో మార్చుకునే వీల్లేదు. అక్కడున్న భారతీయ బ్యాంకులు గల్ఫ్ చట్టాల ప్రకారమే పనిచేస్తుంటాయి కాబట్టి, భారత కరెన్సీని తాము స్వీకరించలేమని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/