లిబియాలో ఐఎస్ తీవ్రవాదులు నలుగురు భారతీయుల్ని కిడ్నాప్ చేయటం.. అనంతరం కర్ణాటకకు చెందిన ఇద్దరు బంధీల్ని విడుదల చేయటం తెలిసిందే. మిగిలిన ఇద్దరికి సంబంధించిన వివరాలు బయటకు రాని పరిస్థితి. ఇక.. ఐఎస్ తీవ్రవాదుల చెర నుంచి బయటపడి.. స్వదేశానికి చేరుకున్న కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్ లు మాట్లాడుతూ.. కిడ్నాపర్ల కు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు.
తమను కిడ్నాప్ చేసిన వారు.. తమ వర్సిటీలోని విద్యార్థలుగా చేరి.. ఆ తర్వాత ఉగ్రవాదులుగా మారిన వారేనని.. వారంతా 17.. 18 ఏళ్ల లోపు వారేనన్నారు. తమను బాగా చూసుకున్నారని చెప్పిన వారు.. తమను విడిచిపెట్టే సమయంలో కిడ్నాపర్ల నాయకుడు మాట్లాడుతూ.. తమ వద్ద బంధీలుగా ఉన్న తెలుగువారిని బాగా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవటం కోసం ప్రత్యేక నెంబరు ఇచ్చారని.. ఆ నెంబర్ కు తాను ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. లిబియాలోని సిర్టే వర్సిటీలో పని చేసే ఈ ప్రొఫెసర్ లు స్వదేశంలోకి అడుగుపెట్టిన తర్వాత.. తమ జీవితంలో ఇదే అత్యుత్తమ క్షణాలుగా పేర్కొన్నారు. మనిషి రూపంలో ఉన్న రాక్షసుల చేతికి చిక్కి బయటపడటం అంత చిన్న విషయం కాదు కదా.