మైనార్టీలను మోడీ సర్కారు దెబ్బ తీయాలని భావిస్తోందా? మతాచారాల విషయంలో మోడీ ప్రభుత్వం కొత్త పరిమితులు సృష్టించాలని చూస్తుందా? మైనార్టీల మనోభావాల్ని దెబ్బ తీసే నిర్ణయాల్ని తీసుకునేందుకు మోడీ సర్కారు దూకుడుగా వ్యవహరిస్తుందా?... ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడే కాదు.. గతంలో కూడా వచ్చినవే. అయితే.. ఇప్పుడీ ప్రశ్నలన్నీ సరికొత్తగా మరోసారి తెర మీదకు వస్తున్నాయి. అసలు విషయాన్ని తెలివిగా డైవర్ట్ చేసేందుకు సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకొస్తున్న తీరు చూస్తే.. మార్పు కొందరికే కానీ అందరికి కాదన్నట్లుగా కొందరు నేతలు భావిస్తున్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
మతం కానీ కులం కానీ ఎందులో అయినా సరే.. తప్పులు ఉంటే సరిదిద్దుకోవటం తప్పేం కాదు. నిత్యం పలువురితో పోలిక పెట్టే వారంతా.. ఈ రోజు ట్రిపుల్ తలాక్ విషయానికి వస్తే మాత్రం.. మా రూల్స్ మాకే.. మమ్మల్నిమరెవరితోనూ పోల్చవద్దంటూ పెద్ద పెద్దగా మాట్లాడేస్తున్నారు. మరి.. ఇలా మాట్లాడేవారంతా మిగిలిన విషయాల్లో కూడా పోలిక వద్దని చెబుతారా? అంటే లేదనే చెప్పాలి.
పాకిస్థాన్ సహా.. పలు అరబ్ దేశాల్లో నిషేధించిన ట్రిపుల్ తలాక్ ను భారత్ లో నిషేధిస్తే తప్పేంటి? పెళ్లి అనే బంధాన్ని సింపుల్ గా మూడు మాటల్లో (తలాక్.. తలాక్.. తలాక్)తేల్చేసే దారుణం గురించి దేశంలో జరిగిన చర్చ తక్కువనే చెప్పాలి. ప్రగతిశీల సంఘాలు కానీ.. మేదావులు కానీ.. వామపక్షవాదులు కానీ.. సమానత్వం కోసం పోరాడే వారు కానీ.. మహిళల హక్కులు.. సాధికారిత గురించి గళం విప్పే వారెవరూ ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడటానికి పెద్ద ఆసక్తిని ప్రదర్శించరు.
వేర్వేరు మతాలకు సంబంధించి.. వారి పురాణాలకు సంబంధించి నిత్యం లోతైన పరిశోధన చేసినట్లుగా చెప్పి.. తరచూ బొక్కలు వెతికే సూడో మేధావులు సైతం.. ఇస్లాంలోని కొన్ని మూఢాచారాలను ప్రశ్నించే సాహసం చేయరు. మేధావులే ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు.. ఓటుబ్యాంకు రాజకీయం చేసే పార్టీలు మరెంత అప్రమత్తంగా ఉంటాయి. ఇస్లాంను తూచా తప్పకుండా పాటిస్తూ.. కఠిన నిబంధనల్ని అమలు చేసే అరబ్ దేశాలు సైతం ట్రిపుల్ తలాక్ పై బ్యాన్ చేసినప్పుడు.. భారత్ లో బ్యాన్ చేసే అంశంపై ఆ వర్గానికి చెందిన పురుష నేతలు ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో ఒక మగాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవటానికి చట్టబద్ధత ఇవ్వటం ఏమిటి? అదే పని ఒక మహిళ చేస్తానంటే ఏం చేస్తారు?
ఇంత దారుణమైన విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తే.. ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావటానికి మోడీ సర్కారు ప్రయత్నిస్తుందంటూ కొత్త తరహా దాడి దేనికి నిదర్శనం? ట్రిఫుల్ తలాక్.. బహుభార్యత్వానికి చరమగీతం పాడేందుకు సుప్రీం కోర్టు సన్నాహాలు చేస్తున్న వేళ.. తమ విషయాల్లో ఎవరూ కల్పించుకోకూడదని.. ఎవరూ మాట్లాడకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న ముస్లిం నేతలు.. వారికి కొమ్ము కాసే ముస్లిం పర్సనల్ లా బోర్డు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు.. సమానుల్లో తాము అధికులమన్నట్లుగా వ్యవహరించే ధోరణి కనిపిస్తుంది. అంతేకాదు.. దురాచారాలకు చెక్ చెప్పే సాహసోపేతమైన ప్రయత్నాలు మొదలైన ప్రతిసారీ వాటిని దెబ్బ తీసేలా చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి.
అందుకు తగ్గట్లే తాజా పరిణామాలు కూడా అని చెప్పొచ్చు. ట్రిపుల్ తలాక్ పై నిషేధం విధించాలా? వద్దా? అన్న ప్రశ్నపై సుప్రీం దృష్టి సారిస్తే.. అందుకు భిన్నంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు తెచ్చే కుట్ర జరుగుతుందంటూ ముస్లిం పెద్దలు.. మజ్లిస్ లాంటి రాజకీయ పార్టీలు విష ప్రచారం చేయటం మొదలైంది. వాటికి తగ్గట్లుగా మేధావులు కొందరు తమ కలాల్నిఝుళిపించటం చూస్తే.. ఈ దేశంలో ‘కొందరి’ మాటకు.. వారి మైండ్ సెట్ కు తగినట్లుగా ముస్లింలంతా నడవాలన్నట్లుగా కనిపిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ఎలాంటి కసరత్తు జరగనప్పటికీ.. ట్రిపుల్ తలాక్ మాటను మాట వరసకు కూడా మాట్లాడని ఓవైసీ లాంటోళ్లు.. తమను ఏదో చేసేస్తున్నారంటూ ఆందోళన పడటం గమనార్హం.
ఓపక్క ట్రిపుల్ తలాక్ మీద తమ అభ్యంతరాల్ని ముస్లిం మహిళలు పెద్దఎత్తున తెర మీదకు తీసుకొస్తున్న వేళ.. వారి గళాన్ని వినిపించకుండా చేసేందుకు ముస్లిం పర్సనల్ లాబోర్డు.. మజ్లిస్ అధినేత లాంటి వారు పన్నుతున్న కుయుక్తులకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే.. వారు వినిపించే వాదనల్ని పరిగణలోకి తీసుకొని గందరగోళానికి గురి కావటంలో అర్థం లేదు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/