అగ్రరాజ్యం అమెరికా భారతీయులకు షాక్ ఇస్తున్న సంఘటనలు సీరియల్ రూపంలో అనేకం సాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమానవీయ వలస విధానంలో భాగంగా భారత్‌కు చెందిన అక్రమ వలసదారుల పిల్లలను కూడా తల్లిదండ్రుల నుంచి వేరు చేశారు. మెక్సికో సరిహద్దుల గుండా దాదాపు 100 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారు. వీరిని రెండు నిర్బంధ గృహాల్లో ఉంచిన అమెరికన్ అధికారులు.. వారి పిల్లలను చిన్నారుల వసతి కేంద్రాలకు తరలించారు. అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం అధికారులు ఈ రెండు నిర్బంధ గృహాల అధికారులతో మాట్లాడారు. అయితే నిర్బంధ గృహాల్లో ఉన్న భారతీయులకు భారత ప్రభుత్వం ఎటువంటి దౌత్యపరమైన వెసులుబాటు కల్పించలేదు. సిక్కు, క్రైస్తవ మతానికి చెందిన 52 మంది అక్రమ వలసదారులు ఓరేగాన్‌లోని డిటెన్షన్ కేంద్రంలో ఉండగా.. న్యూమెక్సికోలో ఉన్న డిటెన్షన్ కేంద్రంలో దాదాపు 45 మంది భారతీయులు ఉన్నారు. ఈ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అమెరికాలోని ఆరేగాన్ జైలులో మగ్గుతున్న 120 మంది వలస ప్రజలు తక్షణం న్యాయ సాయం పొందేందుకు అనుమతించాలని ఆరేగాన్ డిస్ట్రిక్ట్ జడ్జి మిఖేల్ సిమన్ అత్యవసర ఆదేశాలను జారీ చేశారు. సంబంధిత వలసదారులు తమ న్యాయవాదులతో సమావేశం కావడానికి అనుమతించాలని జడ్జి సోమవారం ఆదేశించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. సుమారు 100 మంది భారతీయులు.. ప్రత్యేకించి పంజాబీలు దక్షిణ సరిహద్దుల నుంచి అక్రమంగా దేశంలో చొరబడ్డారని ఆరోపిస్తూ అధికారులు వారిని నిర్బంధించారు. న్యూ మెక్సికో రాష్ట్రంలోని డిటెన్షన్ కేంద్రంలో 40-45 మంది భారతీయులు, ఆరేగాన్ డిటెన్షన్ కేంద్రంలో 52 మంది భారతీయులు (అత్యధికులు సిక్కులు, క్రైస్తవులు) ఉన్నారని అమెరికా అధికారులు తెలిపారు. కానీ అమెరికా పౌరహక్కుల సంఘం (ఏసీఎల్‌యూ), ఇన్నోవేషన్ లా ల్యాబ్ అనే సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జడ్జి మిఖేల్ సిమన్.. వారికి న్యాయ సాయం అందజేయాలని ఆదేశించారు.