అమెరికాలో $8 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డ భారతీయుడు

Update: 2022-11-11 04:34 GMT
అమెరికాలో భారతీయులు పలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వరుసగా స్కాంలలో ఆరోపణల పాలువుతున్నారు. చాలా తెలివిగా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా నార్త్ కరోలినాలో మరో మోసం వెలుగుచూసింది. ఓ భారతీయుడు ఏకంగా 8 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డాడు.
 
నార్త్ కరోలినాలోని వేక్ కౌంటీలో నివసిస్తున్న అభిషేక్ కృష్ణన్ (40) ఈ భారీ మోసం సూత్రధారిగా పోలీసులు తేల్చారు. సాధారణ గుర్తింపు ఉన్న ఈ వ్యక్తి కోవిడ్19 ఉపశమన మోసం పథకం అంటూ ఏకంగా ఫెడరల్ ప్రభుత్వాన్ని $8 మిలియన్లను మోసగించాడని తేలింది. ఒక సామాన్య భారతీయుడు ఏకంగా అమెరికా ప్రభుత్వాన్ని చీట్ చేసిన వైనం  నమ్మడం కష్టం.

కరోనావైరస్ ఎయిడ్ రిలీఫ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ (కేర్స్) చట్టం కింద స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌బిఎ) హామీ ఇచ్చిన పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పిపిపి) లోన్‌లలో మోసపూరితంగా మిలియన్ డాలర్లను మన భారతీయ అభిషేక్ పొందాడు. అమెరికా అధికారుల ప్రకారం.. కృష్ణన్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఫెడరల్ ఇన్సూరెన్స్ చేసిన బ్యాంకులకు అనేక పీపీపీ రుణ దరఖాస్తులను సమర్పించాడు. ఇందులో కంపెనీల ఉద్యోగులు , పేరోల్ ఖర్చులు అలాగే తప్పుడు పన్ను దాఖలు గురించి తప్పుడు ప్రకటనలు ఉన్నాయి.

కృష్ణన్ తనకు తెలియకుండా మరొక వ్యక్తి పేరును కూడా ఉపయోగించాడు. కనీసం $8.2 మిలియన్ల మోసానికి పాల్పడ్డాడు. $3.3 మిలియన్లకు పైగా రుణాన్ని పొందాడు. కృష్ణన్‌పై రెండు వైర్ ఫ్రాడ్, రెండు మనీ లాండరింగ్, రెండు గణనల గుర్తింపు దొంగతనం ఆరోపణలు ఉన్నాయి.

రుజువైతే, కృష్ణన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. గుర్తింపు దొంగతనం యొక్క ప్రతి కౌంట్‌పై తప్పనిసరిగా 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇలా అమెరికా సర్కార్ కే టోకరా వేసిన భారతీయుడి కోసం అమెరికన్ పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News