కాంగ్రెస్ నేత సిగ్గుప‌డేలా మిస్‌ వ‌రల్డ్ రిప్లై

Update: 2017-11-20 16:48 GMT
అత్యున్న‌త స్థానంలో ఉన్న నాయ‌కులు..ఎంత హుందాగా వ్య‌వ‌హ‌రించాలో...పైగా మ‌హిళ‌ల‌ విష‌యంలో చిల్ల‌ర కామెంట్లు చేయ‌కుండా వారి గౌర‌వాన్ని కాప‌డ‌ట‌మే కాకుండా..త‌న హుందాత‌నాన్ని నిలుపుకొనే వ్య‌వ‌హ‌రించాలో తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల‌...కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ బ్యూరోక్రాట్ కూడా అయిన శ‌శిథ‌రూర్ త‌న ప‌రువు పోగొట్టుకున్నారు. 17 ఏళ్ల తర్వాత ఇండియాకు మిస్ వరల్డ్ కిరీటం తీసుకొచ్చిన మానుషి చిల్లార్‌ను ఉద్దేశిస్తూ...చిల్లార్ అనే పదాన్ని చిల్లరగా మార్చి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చేప‌ట్టిన నోట్ల రద్దుకు లింకు పెట్టిన థరూర్ త‌న పైత్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఓ ట్వీట్ చేయ‌డం...ఆ ట్వీట్ పెను దుమారం రేపిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన ట్వీట్‌ ను మిస్ వరల్డ్ మానుషి మాత్రం లైట్ తీసుకుంది. ఎంతో పరిణతి కనబరచిన ఆమె.. సున్నితంగానే థరూర్ సిగ్గుపడేలా ట్వీట్ చేసింది. `ప్రపంచాన్ని గెలిచిన ఓ యువతి ఇలాంటి వ్యాఖ్యలకు ఏమీ అసంతృప్తి చెందదు.. చిల్లర మాటలు ఓ చిన్న మార్పు మాత్రమే. చిల్లార్‌లో చిల్ ఉన్నదని మరచిపోవద్దు` అని ఆమె ట్వీట్ చేసింది. దీంతో దిమ్మ తిరిగిపోవ‌డం థ‌రూర్ వంతు అయింది. జాతీయ మహిళా కమిషన్ కూడా థరూర్ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకొని సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. ఇలా ప‌రిణామాలు పూర్తిగా మారిపోతుండ‌టంతో శ‌శిథ‌రూర్ దిగివ‌చ్చారు.

త‌న ట్వీట్ల వివాదం గురించి ప్ర‌స్తావిస్తూ...తన కామెంట్స్‌కు చింతిస్తూ శశి థరూర్ మ‌రో ట్వీట్ చేశారు. మానుషికి క్షమాపణ చెప్పారు. ఆమెను కించపరిచే ఉద్దేశం లేదని ట్వీట్ చేశారు. కాగా, ఇటు మ‌హిళా సంఘాలు, అటు బీజేపీ నేత‌లు, సామాజిక‌వాదులు సైతం థ‌రూర్ కామెంట్ల‌ను తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నాయి.
Tags:    

Similar News