భారతీయులు విభిన్న రంగాల్లో రాణించి విదేశాల్లో పేరు తెచ్చుకుంటూ భారత్ ప్రతిష్ఠను నిలుపుతున్నారు. అదేసమయంలో అక్కడ వెధవ పనులు చేసి పరువు తీసినవారూ ఉంటున్నారు. తాజాగా అమెరికాలో ఓ భారతీయ మహిళ చేసిన వెధవ పనికి అక్కడి కోర్టు అయిదున్నర సంవత్సరాల జైలు శిక్ష వేసింది.
నాలుగు బ్యాంకులను దోచుకోవడమే కాకుండా బాంబులతో పేల్చేస్తానని బెదిరించిన భారతీయ మహిళకు అమెరికా కోర్టు 66 నెలల జైలు శిక్ష విదించింది. సుమారు రూ. 25 లక్షలు జరిమానాగా విధించింది. భారత సంతతికి చెందిన సందీప్ కౌర్ (24) గత ఏడాది మేలో నాలుగు బ్యాంకులను లూటీ చేసిందని అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. అమెరికాలోకి కాలిఫోర్నియా కోర్టులో కేసు విచారణ జరిగింది.
వివాహ జీవితం అడ్డదిడ్డంగా మారడం... షేర్ మార్కెట్ లో సంపాదించింది కేసినోల్లో పోగొట్టుకోవడంతో ఆమె ఈ దోపిడీ మార్గం ఎంచుకుంది. అయితే... ఇంత పెద్ద దొంగతనాలు చేసిన ఈమె కనీసం తుపాకీ కూడా తీసుకెళ్లకుండా కేవలంలో మాటలతోనే బెదిరించి... బాంబులు వేస్తానని హడావుడిచేసి నాలుగు బ్యాంకులు దోచుకోవడం గమనారÛం.