అమెరికాలో భార‌త సంత‌తి మ‌హిళ‌కు అవ‌మానం

Update: 2017-03-10 04:14 GMT
అమెరికాలో భార‌తీయుల‌కు ఇంకా ప‌రాభ‌వాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. కెనడాలో ఉంటున్న ఓ భారత సంతతి మహిళను అమెరికాలోకి ప్రవేశించకుండా అధికారులు అడ్డుకున్నారు. 39 ఏళ్ల మన్‌ ప్రీత్ కూనూర్ కెనడా పౌరురాలు. మాంట్రియల్‌ లో ఉంటున్న ఆమె అమెరికాలోని వెర్మెంటో వెళాల్లనుకుని గత ఆదివారం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బయలుదేరారు. ఈ రెండు ప్రదేశాలు కూడా కెనడా-అమెరికా సరిహద్దులోనే ఉన్నాయి. అయితే ఆమెతో పాటుగా ఉన్న ఇద్దరు స్నేహితులు శ్వేతా జాతీయులు కావడంతో అధికారులు వారిని అడ్డుకోలేదు. మన్‌ ప్రీత్‌ ను మాత్రం ఇమిగ్రెంట్ వీసా ఉండాలంటూ ఆపేశారు.

దాదాపు ఆరుగంటల పాటు వేలిముద్రలు, ఫోటోలు తీసుకోవడంతో పాటు పలురకాల ప్రశ్నలు వేశాక ప్రవేశానికి నిరాకరించారని మన్‌ ప్రీత్ ఫేస్‌ బుక్ పోస్టుద్వారా తెలిపారు. తాను ఇమిగ్రెంట్‌ నని, అమెరికాలోకి ప్రవేశించాలంటే సరయిన వీసాతో రావాలని అధికారులు చెప్పారని, తనకు ఇది నమ్మశక్యంగా లేదని ఆమె పేర్కొన్నారు. ‘ట్రంప్ ప్రభావానికి (ట్రంప్డ్) గురైనట్లు మీరు భావిస్తున్నారని నాకు తెలుసు’ అని బార్డర్ ఏజంట్ అన్నాడని ఆమె తెలిపారు. దేశంలోకి అక్రమ వలసలను నిరోధించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా తాత్కాలిక నిషేధం విదించడం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News