రెండు దశాబ్దాలుగా అమెరికాలో నివాసముంటున్న ఓ కుటుంబం విమాన ప్రమాదంలో మృతిచెందింది. ముచ్చటపడి కొనుక్కున్న విమానంలో ప్రయాణం చేస్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అది కూలి మరణించారు.
భారత్‌కు చెందిన జస్వీర్ ఖురానా(60) - ఆయన భార్య దివ్యా ఖురానా(54) ఎయిమ్స్ లో చదువుకుని వైద్యులయ్యారు. 20 సంవత్సరాల క్రితం వీరు అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. జస్వీర్ ఓ యూనివర్శిటీలో పనిచేస్తుండగా.. దివ్య పిల్లల ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీరు కొద్దిరోజుల కిందట ఒక పాత విమానాన్ని కొనుక్కున్నారు. గురువారం ఆ దంపతులిద్దరూ తమ కుమార్తె కిరణ్ తో కలిసి ఫిలడెల్ఫియా నుంచి ఓహియోకు విమానంలో బయలు దేరారు. విమానం 44 సంవత్సరాల పాతది కావడంతో అనుకోకుండా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అదుపుతప్పింది. కాగా... దానిని కంట్రోల్ చేయడం జస్వీర్ వల్ల కాలేదు. దీంతో... విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
కాగా.. విమానంలో ఫ్యూయల్ అయిపోవడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి మృతిపట్ల కుటుంబసభ్యులు - బంధువులు - స్థానిక భారతీయ సమాజం షాక్ అయింది. విమానం పాతది కావడం... జస్వీర్ కు విమానం నడపడంలో అనుభవం కూడా తక్కువ కావడం వల్ల సమస్య తలెత్తినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు.