రోజులో ఎన్ ఆర్ ఐ డాక్ట‌ర్ల‌ను వెళ్లిపొమ్మ‌న్నారు

Update: 2017-04-02 10:35 GMT
అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత అమెరికాలో ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయ‌న‌టానికి తాజా ఉదంతం ఒక పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. మామూలు వారి విష‌యం త‌ర్వాత ప్ర‌ముఖులైన ఒక వైద్య జంట విష‌యంలో అమెరికా ఇమ్మిగ్రేష‌న్ అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. అమెరికాలోని ప‌రిస్థితులు ఎంత‌టి అనిశ్చితిలో ఉన్నాయ‌న్న విష‌యం స్ప‌ష్టం చేస్తుందని చెప్పాలి. కేవ‌లం 24 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఇచ్చి.. దేశం విడిచి వెళ్లాలంటూ యూఎస్ ఇమ్మిగ్రేష‌న్ అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. ఇలాంటి ప‌రిస్థితులు ఎదురైతే.. త‌మ ప‌రిస్థితి ఏమిట‌న్న సందేహాన్ని క‌లుగజేస్తుందీ వైనం.  

షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. టెక్సాస్‌లోని ప్ర‌ముఖ న్యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ పంక‌జ్ ఆయ‌న స‌తీమ‌ణి డాక్ట‌ర్ మోనికాలు వైద్య‌రంగంలో ప్ర‌ముఖులు. ప్ర‌వాస‌భారతీయుడైన‌ పంకజ్ విష‌యానికే వ‌స్తే.. ఆయ‌న నెల‌కు 200 న్యూరో స‌ర్జ‌రీలు చేస్తుంటారు. 40 ఏళ్ల ఈ యువ డాక్ట‌ర్‌.. యూఎస్‌లో అత్యంత వృత్తినిపుణుల కింద అక్క‌డి వైద్యులు వీరిని ప్ర‌స్తావిస్తుంటారు. అలాంటి ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. వారిద్ద‌రూ యూఎస్‌లోనే జ‌న్మించారు.  ఇదిలా ఉండ‌గా.. మారిన ఇమ్మిగ్రేష‌న్ పాల‌సీలో భాగంగా.. ఈ జంట‌ను కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలో  దేశం విడిచి వెళ్లిపోవాల‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఇమ్మిగ్రేష‌న్ అధికారుల నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల‌తో ఈ డాక్ట‌ర్ జంట‌కు నోట మాట రాలేదు.

ఎందుకంటే.. డాక్ట‌ర్ పంక‌జ్ వారాంతానికి 90 మంది పేషంట్ల‌కు వైద్య‌సేవ‌లు అందించాల్సి ఉంటుంది. ఆయ‌న అపాయింట్‌మెంట్ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. ఇదే విష‌యాన్ని ఇమ్మిగ్రేష‌న్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయిన‌ప్ప‌టికీ వారి నుంచి ఎలాంటి సానుకూల స్పంద‌న ల‌భించ‌లేదు. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ఇద్ద‌రు డాక్ట‌ర్లు.. ప‌న్ను చెల్లింపు విష‌యంలోనూ ముందుంటారు. ఏడాదికి ఒక‌సారి చెల్లించాల్సిన ప‌న్నును ప్ర‌తి మూడు నెల‌ల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లిస్తార‌న్న పేరుంది. త‌మ‌ను ఎందుకంత అర్జెంట్ గా దేశం విడిచి వెళ్లిపొమ్మంటున్నారో అర్థం కాని ప‌రిస్థితి.

దీంతో.. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను మీడియా దృష్టికి తీసుకురావ‌టంతో పాటు.. న్యాయ‌నిపుణుల దృష్టికి తీసుకెళ్లారు. నిపుణుల సూచ‌న మేర‌కు తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌పై కోర్టులో పిటీష‌న్ వేశారు. అదే స‌మ‌యంలో ఇమ్మిగ్రేష‌న్ అధికారులు చెప్పిన‌ట్లే దేశం విడిచి వెళ్లిపోయేందుకు తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. అనూహ్యంలో ఈ ఎపిసోడ్‌లో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. యూఎస్‌లో వీరు ఉండేందుకు వీసా కొన‌సాగింపున‌కు అంగీక‌రిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అత్యున్న‌త స్థాయిలో జ‌రిగిన నిర్ణ‌యం మేర‌కు అధికారులు త‌మ మ‌న‌సుల్ని మార్చుకున్న‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ ఎపిసోడ్‌కు సంతోష‌క‌ర‌మైన ముగింపు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇమ్మిగ్రేష‌న్ అధికారుల తీరుపై మాత్రం ప్ర‌వాస భార‌తీయులకు కొత్త టెన్ష‌న్ గా మారింది. ఎప్పుడేం జ‌రుగుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌ల‌కు ప‌లువురు గురి అవుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News