ఐర్లాండ్ ప్ర‌ధాని రేసులో భారత సంతతి గే

Update: 2017-05-22 04:19 GMT
భార‌తీయుల మ‌రోమారు అంత‌ర్జాతీయ స్థాయిలో త‌మ స‌త్తా చాటే సంద‌ర్భం ఆస‌న్న‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. ఐర్లాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన `గే` ఆ దేశ ప్రధాని పదవి చేపట్టే అవకాశాలున్నాయి. డబ్లిన్‌లో నివసిస్తున్న డాక్టర్ లియో వరద్కర్ (38) ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన తండ్రిది ముంబైకాగా, తల్లిది ఐర్లాండ్. వరద్కర్ 2015లో తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ప్రధానిగా గెలిస్తే ఆ పీఠం ఎక్కిన మొట్టమొదటి స్వలింగ సంపర్కుడిగా రికార్డు సృష్టిస్తారు.

ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ ఇటీవలే తాను పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. దీంతో తాను ప్రధాని పదవికి పోటీ చేయనున్నట్టు వరద్కర్ ప్రకటించారు. ఇప్పటికే క్యాబినెట్‌లోని పలువురు సీనియర్ మంత్రులు, మెజారిటీ ఎంపీలు వరద్కర్‌కు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఆ దేశ గృహనిర్మాణశాఖ మంత్రి సిమ్సన్ కొవెన్నీ సైతం రేసులో నిలబడ్డారు.
Tags:    

Similar News