2014లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ ప్రజల్లో లోకల్ సెంటిమెంట్ మరింత బలపడిన సంగతి తెలిసిందే. దీంతో, ఏ మాత్రం అవకాశం దొరికినా నాన్ అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేయాలని....అక్కడి ఉద్యోగాలన్నీ లోకల్ అమెరికన్లకే రావాలని ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో పలు నిబంధనలను కఠినతరం చేశాడు. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లాలనుకునే వారి ఆశలను కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ఓ భారత సంతతి వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. హెచ్-1బీ వీసా - గ్రీన్ కార్డు ఇప్పిస్తానంటూ అమాయకులనుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. అతడి అసలు రంగు బయటపడడంతో బాధితుల ఫిర్యాదు ప్రకారం అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
రమేష్ వెంకట పోతూరు అనే భారత సంతతి వ్యక్తి విర్గో ఇంక్ - సింగ్ సొల్యూషన్స్ ఆపరేటర్ సంస్థలకు మాజీ యజమాని. అయితే, కొంతమంది భారతీయులకు హెచ్-1బీ వీసా ఇప్పిస్తానంటూ నమ్మబలికి అక్రమంగా 450,000 డాలర్ల ఫీజులను వసూలు చేశాడు. అది గుర్తించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమేష్ అక్రమంగా వీసా జారీ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని విచారణలో తేలింది. అక్రమ వీసా జారీపై విచారణ జరిపిన న్యాయస్థానం రమేష్ కు శిక్ష విధించింది. రమేష్ కు ఏడాది ఒక్కరోజు జైలు శిక్ష విధిస్తున్నామని అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకటించింది. ఈ తరహా మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు...భారతీయులకు సూచించారు.