అగ్రరాజ్యాలకు అహంకారం చాలా ఎక్కువ. వర్థమాన దేశాలంటే వారికుండే చిన్నచూపు అంతా ఇంతా కాదు. వారి అహంకారంతో ప్రముఖులు సైతం తీవ్ర ఇబ్బందులు.. అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి. దెబ్బకుదెబ్బ అన్నట్లుగా వ్యవహరించని మన పాలకుల తీరుతో అగ్రరాజ్యాలకు చెందిన సిబ్బందిఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. ఇష్యూ మరీ పెద్దది అయితే.. ‘‘విచారం వ్యక్తం చేస్తున్నాం’’ అంటూ కంటితుడుపు మాటలు చెప్పటం మినహా గట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు.
మన మాజీ రాష్ట్రపతి కలాం లాంటి వ్యక్తిని సైతం అమెరికా విమానాశ్రయ అధికారులు వ్యవహరించిన ధోరణిపై భారతీయులు మండిపడుతుంటారు. తాజాగా భారతీయ సంతతికి చెందిన ఒక మహిళకు జర్మనీలోని బెర్లిన్ లో దారుణమైన అవమానం జరిగింది. మనిషిగా మాత్రమే కాదు.. మనమ్మాయిగా భారతీయులంతా తన నిరసనను తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతీయుల విషయంలో తొందరపడితే తిప్పలు తప్పవన్నట్లుగా అగ్రరాజ్యాల ఉద్యోగులకు అర్థమయ్యేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకీ మనమ్మాయికి జరిగిన దారుణ అవమానం వివరాల్లోకి వెళితే..
భారత సంతతికి చెందిన గాయత్రీ బోస్ సింగపూర్ లో ఉంటారు. సింగపూర్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో మేనేజర్ గా వ్యవహరించే ఆమెకు మూడేళ్ల బాబు.. ఏడు నె పాప ఉన్నారు. గత గురువారం ఆమె పారిస్ వెళ్లేందుకు బెర్లిన్ లోని ఫ్రాంక్ ఫర్డ్ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఆమె లగేజ్ ను ఎక్స్ రే మిషన్ ద్వారా అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె లగేజ్ లో బ్రెస్ట్ పంప్ (చిన్నపిల్లలకు పాలు పితికే ఉపకరణం) కనిపించింది.
వెంటనే గాయత్రి పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆమెను విచారణ నిమిత్తం ఒక గదిలోకి తీసుకెళ్లారు. ఒక మహిళా అధికారి ఆమెను ప్రశ్నల మీద ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. గదిలోకి తీసుకెళ్లిన మహిళా పోలీస్ జాకెట్ విప్పాలని ఆదేశించారని.. పాలిండ్లు చూపించాలన్నారని గాయత్రీ బోస్ తీవ్ర ఆవేదనతో వెల్లడించారు.
‘‘పాలిండ్లు చూపించిన తర్వాత వాటి నుంచి పాలు వస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు రొమ్ముల్ని ప్రెస్ చేయాలని చెప్పారు. ఏం చేయాలో తోచలేదు. చివరకు ఆ పని చేయక తప్పలేదు. గది నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ నేనేం చేశానో నాకు అర్థమైంది. షాక్ నుంచి తేరుకోలేకపోయాను. జరిగింది తలుచుకొని ఏడుపు ఆపుకోలేకపోయాను. కాసేపు బ్రెస్ట్ పంప్ ను పరీక్షించి.. వదిలేశారు. ఆ తర్వాత పారిస్ వెళ్లేందుకు అనుమతిస్తూపాస్ పోర్ట్ తిరిగి ఇచ్చేశారు’’ అంటూ తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించింది.
తన పట్ల అధికారులు వ్యవహరించిన తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని.. వారు స్పందిస్తూ.. జరిగిందేమో జరిగింది.. ఇక వెళ్లాలంటూ వ్యాఖ్యానించారని వెల్లడించింది. దీనిపై స్పందించేందుకు ఫ్రాంక్ ఫర్డ్ ఎయిర్ పోర్ట్ అధికారులు రియాక్ట్ అయ్యేందుకు నిరాకరించగా.. ఈఉదంతం గురించి తెలిసిన వారు మాత్రం.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/