భూగోళాన్ని కరోనా వైరస్ కకావికలం చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవడంతో ప్రపంచ దేశాలు కన్నీరు పెడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్ద సంఖ్యలో ఈ వైరస్ బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి తగ్గించేందుకు ఆయా దేశాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో అత్యావసర పరిస్థితి, లేదా లాక్‌డౌన్ ప్రకటించడం తదితర చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఆ వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. లాక్‌డౌన్ విధించినా కరోనా వైరస్ కట్టడిలోకి రావడం లేదు. ఎందుకంటే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం లేదని, లాక్‌డౌన్ విధించినా ప్రజలు రోడ్లపైకి రావడం.. సామాజిక దూరం పాటించకపోవడం తదితర చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు అమెరికా వినూత్న చర్య తీసుకుంది. ఈ సందర్భంగా కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఊపిరితిత్తుల వీడియోను బహిర్గతం చేసింది. కరోనా సోకితే ఊపిరితిత్తుల పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతూ అవగాహన కల్పించారు.
కరోనాపై అవగాహన కల్పిస్తూ అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ ఆస్పత్రి సర్జన్ డాక్టర్ కేత్ మార్ట్‌మన్ కరోనా సోకిన ఓ వ్యక్తి ఊపిరితిత్తులను చూపిస్తూ వీడియో విడుదల చేశారు. కరోనా సోకిన 59 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తులు ఎలా దెబ్బతిన్నాయో స్పష్టంగా చూపించారు. త్రీడీ వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆ విశ్వవిద్యాలయం ఈ ప్రయత్నం చేసింది.
అయితే ఆ ఊపిరితిత్తులు కొన్నాళ్ల దాక నిండు ఆరోగ్యంతో ఉన్న వ్యక్తివని ఆ వీడియోలో తెలిపారు. కేవలం బీపీ మాత్రమే ఉన్న ఆ వ్యక్తి ఊపిరితిత్తులు నల్లగా మారిపోయాయి. ఈ సంందర్భంగా విడుదల చేసిన వీడియోలో పసుపు రంగులో ఉన్న ప్రాంతం ఇన్‌ఫెక్షన్ సోకినది. వైరస్ వ్యాపించి అతడిలో పెరిగిపోతుండడంతో ఆ ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో శ్వాస వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ సోకితే మొదట లక్షణాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఆ పసుపు రంగులో మారడంతో ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిని మొత్తానికి శ్వాస పీల్చుకోవడం కష్టమవుతోంది. ఈక్రమంలో ఆ వైరస్ వ్యాప్తి తీవ్రమైతే శ్వాస ఆడక రోగి మృతిచెందే ప్రమాదం కూడా ఉంది. ఇంతటి తీవ్ర రూపం దాల్చిన ఊపిరితిత్తులను చూస్తుంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తమకు ఎక్కడ సోకుతుందేమోనని కంగారు పడుతున్నారు. అందుకే జాగ్రత్త చర్యలు తీసుకుంటే కరోనా వ్యాప్తి చెందదని ఆ వర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. కరోనా సోకకుండా శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.