వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. వరుస విజయాలతో అందరి దృష్టిలో పడ్డ స్పింటర్ ద్యుతి షాకింగ్ ప్రకటన ఒకటి చేశారు. ఆమె లైంగికత మీద గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. వాటిని విజయవంతంగా అధిగమించిన ఆమె ఎవరూ ఊహించనిరీతిలో చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాను స్వలింగ సంపర్కురాలినని.. తాను ఒక అమ్మాయితో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లుగా పేర్కొంది.
తన గ్రామానికి చెందిన ఆ అమ్మాయినే తాను పెళ్లాడనున్నట్లుగా వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ అనంతరం తామిద్దరం పెళ్లి చేసుకోనున్నట్లుగా ద్యుతి పేర్కొంది. రెండు కుటుంబాల వారిని ఒప్పించి పెళ్లాడతామని చెప్పిన ద్యుతి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తమ మనసులు కలిశాయని.. తాము జీవితాంతం కలిసి ఉంటామని పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ద్యుతి నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. అమ్మాయిని పెళ్లాడాలన్న ద్యుతి నిర్ణయాన్ని తాము ఒప్పుకోకపోవటంతో తమతో బంధాన్ని తెంచుకుందని ఆమె తల్లి అకుజి చంద్ వెల్లడించారు. ద్యుతి పెళ్లాడాలనుకున్న అమ్మాయి మనమరాలు అవుతుందని.. మనమరాలితో కూతురు పెళ్లి జరిపించటం ఎలా కుదురుతుందని ద్యుతి తల్లి ప్రశ్నిస్తున్నారు. మరీ.. ఉదంతం చివరకు ఎక్కడి వరకు వెళుతుందో?