ఇటీవల కాలంలో అమెరికాలో ప్రవాస భారతీయుల మరణాలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే కాలిఫోర్నియాలో భారత ప్రొఫెసర్ ఓ లేక్ లో గల్లంతయ్యాడు. అంతకుముందు విశాఖ కుర్రాడు ఓ డ్యామ్ లో మునిగిపోయాడు. ఇప్పుడు మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజాగా హైదరాబాద్ కు చెందిన సయ్యద్ వసీమ్ అలీ(27) అనే యువకుడు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఆదివారం రాత్రి 1 గంటకు అమెరికా కాలమానం ప్రకారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రంలోని బేవ్యూ జిల్లాలో పాల్ ఎవెన్యూ ప్రాంతంలో అలీ కారులో ప్రయాణిస్తుండగా.. వేగంగా దూసుకొచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అలీ అక్కడికక్కడే మరణించాడు. ఈయనతోపాటు మరో మహిళకు గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
యాక్సిడెంట్ కావడంతో అలీ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురావడం చాలా కష్టమైన పని. అందుకే హైదరాబాద్లో ఉన్న అలీ తల్లిదండ్రులు అమెరికాలోనే అతడి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. వారికి తాత్కాలిక వీసాలు ఇప్పించేందుకు సహకరించాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్- తెలంగాణ సీఎం- అమెరికా కాన్సులేట్ అధికారులను అలీ తల్లిదండ్రులు కోరుతున్నారు.