అమెరికా ఫార్మింగ్టన్ యూనివర్సిటీ బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లి అక్కడి ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరి ఉద్యోగం చేస్తున్న వారి జీవితాలు ఇప్పుడు తలకిందులయ్యాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువతి దీనగాథ అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.
హైదరాబాద్ కు చెందిన యువతి 2015లో అమెరికా వెళ్లి అక్కడ పెద్ద చదువులు చదవాలని, పెద్ద ఉద్యోగం చేయాలని ఆశపడింది. ఇందుకోసం 20 లక్షల రూపాయాల వరకూ అప్పు చేసి మరీ అమెరికాలో దిగింది. అనంతరం అక్క్డడ నకిలీ ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరి ఈ మధ్యనే ఉద్యోగంలో చేరింది. అంతా సాఫీగా సాగిపోతోందని అనుకుంటున్న సమయంలో ఆమెకు అమెరికా హోంలాండ్ విభాగం పోలీసులు షాకిచ్చారు. నకిలీ యూనివర్సిటీలో చేరి అమెరికాలో అక్రమంగా ఉంటున్నావని తమతోపాటు రావాలని కాలిఫోర్నియా వదిలి వెళ్లొద్దని.. ఆమె కాలికి ఓ జీపీఎస్ చిప్ అమర్చారు. ప్రతి గురువారం పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని స్పష్టం చేశారు.
తనను అమెరికా పంపడానికి కుటుంబ సభ్యులు 20 లక్షలకు పైగా అప్పు చేశారని.. తాను ఈ మధ్యనే ఉద్యోగంలో చేరానని.. తొలి జీతం కూడా తీసుకోలేదని పోలీసులకు ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. అమెరికాలో నువ్వు ఉండడానికి కుదరదని.. కోర్టుకు హాజరైన ప్రతిసారి లాయర్ ఫీజు కింద 1000 డాలర్లు (70వేల రూపాయలు) చెల్లించాలని అమెరికన్ పోలీసులు యువతికి అల్టీమేటం జారీ చేశారు. అంత డబ్బు తన వద్ద లేదని యువతి విలపించడం మీడియాలో హైలెట్ అయ్యింది. ఇలా అమెరికా వెళ్లిన తెలుగువారికి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదని ఆమె వాపోయింది.