కుటుంబ సభ్యులతో అప్పటి దాకా ఆనందంగా గడిపిన ఓ యువకుడు.. కాసేపట్లో యూకేకు వెళ్లాల్సి ఉంది అయితే. ఇప్పుడే వస్తానని బయటికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం విషాదంగా మారింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని నందిగామలో జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన శివకృష్ణ జనవరి 11న యూకేకు వెళ్లాల్సి ఉంది. బుధవారం తెల్లవారుజామున 2.15 గంటలకు లండన్ కు శివకృష్ణ వెళ్లాల్సి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.
అయితే అంతకుముందు రోజు మధ్యాహ్నం శివకృష్ణ ఇంటి నుంచి స్నేహితులను కలిసేందుకు బయటికి వెళ్లాడు. మధ్యాహ్నం 3.45 గంటలకు వెళ్లిన శివకృష్ణ సాయంత్రం 6 గంటలైన తిరిగి రాలేదు. దీంతో శివ కృష్ణ తండ్రి అతనికి ఫోన్ చేయగా యూకేకు వెళ్లడానికి ఇంకా సమయం ఉందని ఆలోపు వస్తానని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మాటలే అతడి చివరి సంభాషణగా మిగిలింది. ఆ తర్వాత శివకృష్ణ ఇంటికి తిరిగి రాలేదు. కాల్ చేసిన లిప్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. బుధవారం ఉదయం తెల్లవారుజామున శివకృష్ణ ఓ చెట్టుకు ఉరి వేసుకొని కన్పించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి.
యూకేకు వెళ్లడానికి కొన్ని గంటల ముందు శివకృష్ణ ఆత్మహత్య పాల్పడటం మిస్టరీగా మారింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివ కృష్ణకు యూకే వెళ్లడానికి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
కాగా శివకృష్ణ సోదరుడు గోపీకృష్ణ లండన్లో ఎంఎస్ చేస్తున్నారు. దీంతో శివ కృష్ణను సైతం లండన్ పంపించి చదివించాలని తల్లిదండ్రులు భావించారు. ఇద్దరు సోదరులకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని అనుకున్నారు. అయితే శివకృష్ణ మాత్రం లండన్ వెళ్లడానికి ముందే ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకోవడం అందరికీ విషాదాన్ని మిగిల్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.