మనోడి కంపెనీని రూ.25వేల కోట్లకు కొనేశారు

Update: 2017-01-26 17:04 GMT
నిజంగా నిజం. వెయ్యి కాదు పదివేలు కాదు.. ఏకంగా రూ.25వేల కోట్లు. అలా అని అతగాడేమీ పెద్ద ప్రముఖుడేం కాదు. సరైన కంపెనీని పెట్టేసి.. అంతర్జాతీయ కంపెనీ దృష్టిలో పడటంతో అతగాడి కంపెనీని సొంతం చేసుకోవటానికి భారీ మొత్తాన్నే వెచ్చించి మరి కొనుగోలు చేశారు? ఇంతకీ అతగాడు ఎవరు? అదేం కంపెనీ?అంత భారీ మొత్తం పెట్టి కొన్న కంపెనీ ఏది? లాంటి వివరాల్ని చూస్తే..

అతడి పేరు జ్యోతి బస్సనల్. ఢిల్లీ ఐఐటీ కంపెనీ పెట్టాడు. అమెరికాలో యాప్ డైనమిక్స్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాడు. ఇతగాడి కంపెనీ చేసే పనేమిటంటే.. అప్లికేషన్లను మేనేజ్ చేయటంతో పాటు.. వాటిని విశ్లేషిస్తుంది. ఇప్పటికే ఆ కంపెనీకి రెండు వేల మందికిపైనే కస్టమర్లు ఉన్నారు. నాస్ డాక్.. నైక్ లాంటి బడా కంపెనీలతో పాటు సిస్కో కూడా ఆ కంపెనీ కస్టమరే. అయితే..ఈ కంపెనీ పనితీరు సిస్కోకువిపరీతంగా నచ్చేసింది. అంతే.. మనోడితో బేరం పెట్టేసింది.

ఎంత ఇస్తారన్న ప్రశ్నకు.. సిస్కో లెక్కలేసుకొని రూ.25వేలకోట్ల రేటు చెప్పింది. అంతే.. మనోడు మరో ఆలోచన లేకుండా ఓకే అనేశాడు. ఎందుకలా? అంటారా? దానికీ కారణం ఉంది. దాదాపుగా ఏడాదిన్నర కంటే ముందే.. అంటే 2015 నవంబరులో యాప్ డైనమిక్స్ కంపెనీనివాల్యువేషన్ వేయించారు. ఈ కంపెనీ విలువ రూ.12915 కోట్లుగా లెక్క కట్టారు. ఇలాంటి వేళ.. తమ విలువ కంటే రెండింతలు ఎక్కువ ధరకు సిస్కో ఆఫర్ ఇవ్వటంతో జ్యోతి బన్సల్ మరో మాట మాట్లాడకుండా డీల్ కి ఓకే చెప్పేసినట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటీవల కాలంలో ఇంత భారీగా జరిగిన డీల్ లేదని చెబుతున్నారు. మరోవైపు.. ఇంత రేటు పెట్టి కొంటున్న సిస్కో వాదన వేరుగా ఉంది. తమ కంపెనీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే తామీ టేకోవర్ చేసినట్లుగా చెబుతున్నారు. అమ్మేవాడి ఆనందం అమ్మేవాడిది.. కొనేవాడి అవసరం కొనేవాడిది. ఇద్దరికి ఓకే అయిన తర్వాత కదా.. ఇంత భారీ డీల్ ఓకే అయ్యేది. ఏమైనా.. మనోడి కంపెనీని ఇంత భారీ మొత్తం రావటం గొప్పే కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News