అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. ఈ ఎన్నికల్లో అధికార రిపబ్లిక్ అభ్యర్థి , అధ్యక్షుడు ట్రంప్.. ప్రతిపక్ష డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ హోరాహోరీ తలపడుతున్నారు. అయితే భారతీయుల మద్దతు ఎటు అనేది ఆసక్తిగా మారింది.
అమెరికాలో పెద్ద ఎత్తున స్థిరపడ్డ.. ఇప్పటికీ వెళుతున్న భారత ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రం జోబైడెన్ పైనే ఆశలు పెంచుకున్నారు. అమెరికా ఎన్నికల్లో జోబైడెన్ గెలిచి అధికారంలోకి వస్తే గ్రీన్ కార్డుపై ఉన్న ఆంక్షలను తొలగిస్తారని భారత ఐటీ ప్రొఫెషనల్స్ ఆశిస్తున్నారు.వీరిలో చాలా మంది అత్యంత నైపుణ్యం గల వారు ఉన్నారు.
హెచ్1 బీ వీసా వర్క్ పై అమెరికాకు వచ్చిన వీరు ప్రస్తుతం ట్రంప్ సర్కార్ తెచ్చిన ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జో బైడెన్ అధ్యక్షుడు అయితే అమెరికాలో శాశ్వత నివాసానికి ఉద్దేశించి గ్రీన్ కార్డు విధానంపై కొత్త చట్టం తెచ్చి ప్రస్తుత ఆంక్షలను తొలగిస్తారని పలువురు ప్రముఖ ఐటీ ప్రొఫెషనల్స్ అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ గురించి మాత్రం వీరు అస్సలే ప్రస్తావించడం లేదు.