కరోనా కాలంలో నిబంధనలకు అనుగుణంగా క్వారంటైన్ ఉంచటం తప్పేం కాదు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసే ఏర్పాట్ల విషయంలో తేడా దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. మన దేశంలో క్వారంటైన్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోగలం. కానీ.. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మాత్రం క్వారంటైన్ అంటే.. అసలుసిసలు క్వారంటైన్ ఏమిటో అర్థమయ్యేలా చేస్తారు. కఠిన ఆంక్షల్ని కచ్ఛితంగా అమలు చేస్తారు. కొవిడ్ వ్యాప్తికి చెక్ పెట్టటం కోసం కఠినంగా వ్యవహరించటం ఓకే అయినా.. కనీస సౌకర్యాలు లేకుండా చేసిన ఏర్పాట్లతో మన మహిళా క్రికెటర్ల టీం ఆసీస్ లో అష్టకష్టాలు పడుతోంది.
ఇరుకు గదుల్లో వారికి బస కల్పించిన వైనం ఆటగాళ్ల మానసిక స్థితి మీద దారుణ ప్రభావాన్ని చూపిస్తుందన్న మాట వినిపిస్తోంది. పద్నాలుగు రోజుల పాటు బయటకు రాకుండా క్వారంటైన్ ఉండటం ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంగా వారికి ఏర్పాటు చేసిన గదుల్లో బెడ్ పక్కనే కాస్త నడవటానికి తప్పించి దారి లేని పరిస్థితి. చివరకు రూంలో లైట్ గా వ్యాయామం చేయటానికి ఎలాంటి అవకాశం లేకపోవటాన్ని మహిళా క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ గదులు ఇరుకుగా ఉన్నాయని.. బెడ్ నుంచి పక్కకు నడవటం.. తేలికపాటి కసరత్తు చేయటం కూడా కష్టంగానే ఉన్నట్లుగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించటం షాకింగ్ గా మారింది. ఏర్పాట్లు మరీ ఇంత దారుణంగా ఉన్నప్పుడు అభ్యంతరాల్ని వ్యక్తం చేయాలిగా? అన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. ఈ మధ్యనే ఇంగ్లండ్ టూర్ కు వెళ్లిన వేళలోనూ మన మహిళా క్రికెటర్ల టీం క్వారంటైన్ తప్పలేదు. అయితే.. వారి ఏర్పాట్లతో పోలిస్తే ఆస్ట్రేలియా అధికారుల ఏర్పాట్లను తప్పు పడుతున్నారు.
క్వారంటైన్ గదుల బయట బ్రిటన్ లోభద్రతా సిబ్బంది ఉంటే.. ఆస్ట్రేలియాలో మాత్రం అలాంటిదేమీ లేదని.. ఇస్తున్న ఫుడ్ సైతం ఏ రోజుకు ఆ రోజు మార్పులు చేసి పంపుతున్నట్లు చెబుతున్నారు. మిగిలినవన్నీ ఓకే అయినా.. గది విషయంలో మాత్రం తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. కీలకమైన మ్యాచులకు ముందు పద్నాలుగు రోజులు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా హోటల్ లోని ఇరుకు గదుల్లో ఉండిపోవటం.. మనమ్మాయిల ఆటపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
తాజా పర్యటనలో మూడు వన్డేలు.. మూడు టీ20లు.. ఒక డే అండ్ నైట్ టెస్టును ఆడనున్నారు. ఇంత సుదీర్ఘ షెడ్యూల్ ఉన్నప్పుడు.. క్వారంటైన్ పేరుతో కఠిన శిక్షణకు బదులుగా ఇరుకు గదుల్లో బస ఏర్పాటు చేయటం ద్వారా కఠిన శిక్ష వేసినట్లేనని విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహిళా క్రికెటర్లు కావటంతో బీసీసీఐ వివక్ష చూపుతుందని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గదుల్లో కాకుండా.. ప్రైవేటు హోటల్లో క్వారంటైన్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్న ప్రశ్నను సంధిస్తున్నారు. దీనికి బీసీసీఐ నోట మాట రాకుండా ఉండటం గమనార్హం. మ్యాచులు గెలవాలి కానీ అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయని అధికారుల్ని ఏమనాలి?