ట్రంప్ పై ఇండియన్ మహిళ

Update: 2019-01-22 07:28 GMT
కమలా హారిస్.. అమెరికాలోని కాలిఫోర్నియా సెనెటర్ గా చిరపరిచితమైన ఈమె తాజాగా సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో పౌరహక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ నుంచి స్ఫూర్తి పొంది.. ఆయన జూనియర్ డే నాడే ఈ ప్రకటన చేస్తున్నానని వివరించారు. తాను రాబోయే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. కమలా అధ్యక్ష బరిలో దిగుతున్న మొదటి భారతదేశ మూలాలున్న అమెరికన్ కావడం గమనార్హం. మొత్తంగా ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగుతున్న నాలుగో మహిళ కావడం విశేషం.

కమలా మొదటి నుంచి ట్రంప్ కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది వరకు ఈమె బల్టిమోర్, వాషింగ్టన్ డీసీ లలో పోటీచేశారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు.

ఈ సోమవారమే ట్రంప్ కు వ్యతిరేకంగా తన ఎన్నికల ప్రచారాన్ని కమలా ప్రారంభించారు. తాను అమెరిక ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణగా ఉంటానని.. అమెరికన్ల హక్కుల కోసం పోరాడుతానని ప్రకటించారు. ఈమెకు వస్తున్న ఆదరణను బట్టి ఈసారి ఎన్నికల్లో ట్రంప్ కు గట్టి ప్రత్యర్థిగా కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా కమల తల్లి తమిళనాడుకు చెందిన మహిళ. తండ్రి జమైకాకు చెందిన వారు.. వీరిద్దరూ అమెరికాలో స్థిరపడి పెళ్లి చేసుకున్నారు. వీరికి కమలా.. ఆమె చెల్లెలు పుట్టాక విడిపోయారు.  ప్రస్తుతం కమలా కాలిఫోర్నియా సెనెటర్ గా ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ నల్లజాతీయురాలు.

కమలతోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న మహిళల సంఖ్య ఇప్పటికీ నాలుగుకు చేరింది. ఎవరు గెలిచినా ఈసారి మహిళా అధ్యక్షురాలే వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Full View
Tags:    

Similar News