టోక్యో : ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌ లో భారత్ మహిళల హాకీ జట్టు !

Update: 2021-08-02 06:15 GMT
జపాన్ , టోక్యో ఒలింపిక్స్‌ లో మహిళల ఫీల్డ్ హాకీ క్వార్టర్ ఫైనల్స్‌ లో ఆస్ట్రేలియాపై భారత జట్టు విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ 2020 సెమీస్ చేరి చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను 1-0తో ఓడించి భారత జట్టు సెమీస్ చేరింది. 22వ నిమిషంలో గుర్జిత్ కౌర్ గోల్ కొట్టి భారత్‌ కు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. భారత్ ఈ లీడ్ పాయింట్‌ను మ్యాచ్ మొత్తం కొనసాగించింది.

 49ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.  పురుషుల జట్టుతో సమానంగా ఏ మాత్రం తీసిపోని విధంగా మహిళల జట్టు కూడా  పోరాడింది. క్వార్టర్ ఫైనల్స్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. సెమీ ఫైనల్స్‌లోకి దర్జాగా అడుగు పెట్టింది రాణి రాంపాల్ టీమ్. ఇంకొక్క విజయం చాలు.. ఈ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని ముద్దాడటానికి. చివరి వరకు ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగిందీ మ్యాచ్. ఈ మ్యాచ్‌ లో 1-0 గోల్స్ తేడాతో భారత్ విజయ దుందుభి మోగించింది.

ఇక ఇప్పటికే  క్వార్టర్ ఫైనల్‌ లో గ్రేట్ బ్రిటన్‌ తో జరిగిన పోరులో మన్‌ ప్రీత్ సేన 3-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌ కి  దూసుకెళ్లింది. ఒలింపిక్స్‌ లో భారత జట్టు సెమీస్‌కు వెళ్లడం 49 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 1972లో భారత జట్టు ఒలింపిక్ సెమీస్‌ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టు క్వార్టర్స్ దాటలేదు. కాగా, సెమీస్‌ కు చేరిన భారత జట్టు ఈ నెల 3న బెల్జియంతో తలపడుతుంది.
Tags:    

Similar News