అగ్రరాజ్యం ఓవైపు చైనా తమకు శత్రుదేశం అంటూ ప్రపంచమంతా కలరింగ్ ఇస్తూ ఆ దేశస్థులు అమెరికా రావడానికి వీసాను కేవలం 3 రోజుల్లో జారీ చేస్తోంది. ఇక భారత్ తమ ప్రజాస్వామ్య మిత్రదేశం అంటూ భారతీయులకు మాత్రం వీసా ఇవ్వడానికి 900 రోజులు అంటే మూడేళ్లు ఎదురుచూసేలా చేస్తోంది. భారత్ ను ఒకలాగా.. కుట్రకారు చైనాను మరోకలాగా చూస్తోంది. దీనిపైనే అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆన్ లైన్ పిటీషన్లు, ఇతర మార్గాల్లో లేఖల యుద్ధం మొదలుపెట్టారు.
భారత్ లో అమెరికా వీసా అపాయింట్ మెంట్ కోసం నిరీక్షించే సమయాన్ని తగ్గించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే change.org ద్వారా ఆన్ లైన్ లో పిటీష్ దాఖలు చేశారు. వీసా కోసం నిరీక్షించే సమయం తగ్గేలా చర్యలు తీసుకోవాలని స్టేట్ డిపార్ట్ మెంట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్ ను కోరారు.
అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించాలన్నా.. ఉన్నత చదువులు చదవాలన్నా వీసా తప్పనిసరి. వీసా ఉంటేనే అమెరికాలో అడుగుపెట్టగలం. కానీ వీసా పొందేందుకు విదేశీ పౌరులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తు దారులకు ఆయా దేశాల్లోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూలు ఉంటాయి. వీసా కోసం అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ కోసం వేసి ఉండాల్సిన సమయాన్ని అపాయింట్ మెంట్ టైంగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం అమెరికా విజిటింగ్ వీసా కోసం 900 రోజులకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. అదే స్టూడెంట్ వీసా కోసం 400 రోజులు సమయం పడుతోంది. దీంతో ఇన్ని రోజులు వెళ్లాలనుకునే పర్యాటకులు, స్టూడెంట్ లకు నానా రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యమైన సమయాల్లో, పండుగల వేళ తమ కుటుంబ సభ్యులను చూసేందుకు అమెరికా రాలేకపోతున్నారు భారతీయులు. స్టూడెంట్ వీసా ఆలస్యం అయ్యి విద్యార్థులు చదువులు నష్టపోతున్నారు.
ఈ క్రమంలోనే వీసా వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) అనే ప్రవాస భారతీయ సంస్థ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్ ను ఉద్దేశిస్తూ ఆన్ లైన్ పిటీషన్ ను ప్రారంభించింది. చైనాకు 3 రోజుల్లో ఇచ్చి.. భారతీయులకు 900 రోజులు పెట్టడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం ేశారు. మానవత్వపు కోణాన్ని దృష్టిలో ఉంచుకొని వేగంగా స్పందించాలని అమెరికాను కోరుతున్నారు. ఈ మేరకు పిటీషన్ తో హోరెత్తిస్తున్నారు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.