అమెరికా : హెచ్‌-1బీ వీసాదారుల భారీ నిరసన ర్యాలీ !

Update: 2020-07-24 11:37 GMT
గ్రీన్‌ కార్డుల జారీకి సంబంధించిన ఓ కీలక బిల్లు గత కొన్నిరోజులుగా నిలిచిపోవడం పై అమెరికాలో భారతీయులు నిరసన వ్యక్తం ర్యాలీ తీశారు. యూఎస్‌ లో శాశ్వత నివాసాన్ని క‌ల్పించే గ్రీన్‌కార్డు జారీకి సంబంధించిన ఓ కీల‌క బిల్లు నిలిచిపోవ‌డం ప‌ట్ల వారు త‌మ నిర‌స‌న‌ను తెలుపుతూ బుధ‌వారం ఉద‌యం వాషింగ్ట‌న్‌ లో ర్యాలీ నిర్వ‌హించారు. ఈక్వాలిటీ ర్యాలీ పేరిట చేప‌ట్టిన ఈ భారీ ర్యాలీ లోచాలామంది భార‌తీయ మ‌హిళ‌లు, పిల్లలు కూడా పాల్గొన్నారు. అమెరికా లో చాలా కాలంగా ఉంటున్న ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఇతర ఉద్యోగులు గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తుండడం తో ఈ విధానంలో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ్ విధానంలో ఎంప్లాయిమెంట్ బేస‌డ్ గ్రీన్‌ కార్డు జారీల బిల్లును తీసుకువ‌చ్చారు. దీని ద్వారా ప్ర‌స్తుతం ఉద్యోగ వీసాల‌పై దేశాల‌వారీగా ఉన్న 7 శాతం ప‌రిమితిని ఎత్తివేయాల‌ని నిర్ణ‌యించారు. కానీ, దీన్ని ఇల్లినాయిస్ డెమొక్ర‌టిక్ సెనెట‌ర్ డిక్ డ‌ర్బిన్ వ్య‌తిరేకించారు. దీంతో ఈ బిల్లు సెనెట్ ‌లో నిలిచిపోయింది. అందుకే ఆయ‌న తీరుకు నిర‌స‌న‌గా భార‌తీయ హెచ్‌1బీ వీసాదారులు ఇలా నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టారు. బారతీయులపై ఉన్న ద్వేషాన్ని వదులుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దేశాభివృద్ధికి కృషి చేస్తూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న వారికి గ్రీన్ కార్డుల జారీని అడ్డుకోవడం అన్యాయమంటూ గళమెత్తారుఆశ్రయం కోరుతూ దేశంలోకి అక్రమంగా వస్తున్న మైనర్లకు అన్ని హక్కులు కల్పిస్తున్నట్టుగానే చట్టబద్ధంగా దేశంలోకి వస్తున్న మైనర్లకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. దీన్ని డ‌ర్బిన్ అడ్డుకోవ‌డం అన్యాయ‌మ‌ని, ఎన్నో ఏళ్లుగా యూఎస్‌లో ఉంటూ దేశ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి గ్రీన్‌కార్డుల జారీని అడ్డుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజస‌మ‌ని ఇమ్మిగ్రేషన్ వైస్ ప్రెసిడెంట్ అమన్ కపూర్ అన్నారు.
Tags:    

Similar News