నైజీరియ‌న్ల చేతిలో మ‌నోళ్ల కిడ్నాప్‌...న‌డి స‌ముద్రంలోనే...

Update: 2019-12-06 04:37 GMT
నైజీరియాకు చెందిన దొంగ‌ల ముఠాను దారుణానికి ఒడిగ‌ట్టింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన నౌక‌లో వెళ్తున్న 18 మంది భార‌తీయులను  ఆ దేశానికి చెందిన స‌ముద్ర దొంగ‌లు కిడ్నాప్ చేశారు. నైజీరియా తీరం వ‌ద్ద స‌ముద్ర దొంగ‌లు వారిని అప‌హ‌ర‌ణ‌కు చేశారు. డిసెంబ‌ర్ 3వ తేదీన సాయంత్రం పూట వీఎల్‌సీసీ నేవీ కాన్‌స్ట‌లేష‌న్ నౌక‌ను స‌ముద్ర‌దొంగ‌లు అటాక్ చేశారు. నైజీరియా వ‌ద్ద ఈ నౌక‌ను హైజాక్ చేశారు. సముద్రపు దొంగలు నౌకను సముద్ర జలాల్లోనే వదిలివేసి సిబ్బందిని మాత్రమే అపహరించారు. అనంతరం అ ఓడను నైజీరియా నావికాదళ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ ప‌రిణామం క‌ల‌క‌లం రేకెత్తింది.

నైజీరియాలోని బొన్నీ సముద్ర తీరానికి దక్షిణంగా 66 నాటికల్‌ మైళ్ల దూరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ కిడ్నాప్ సంఘటన చోటుచేసుకుంది. కాగా, కిడ్నాప్ స‌మాచారం రావ‌డంతో నైజీరియా అధికారుల‌తో భార‌త ప్ర‌భుత్వం మాట్లాడింది. నౌక‌ల క‌ద‌లిక‌ల‌ను ట్రాక్ చేసే ఏఆర్ఎక్స్ మారిటైమ్ సంస్థ త‌న వెబ్‌సైట్‌లో హాంగ్‌కాంగ్ నౌక పైరేట్ల‌కు దొరికిన‌ట్లు చెప్పింది. మొత్తం 19 మంది కిడ్నాప్ అయ్యార‌ని, దాంట్లో 18 మంది భార‌తీయులు ఉన్న‌ట్లు తెలియ‌జేసింది. ఒకరు టర్కీ దేశీయుడని సమాచారం.


ఇదిలాఉండ‌గా,  ఘటనకు ముందు భారత్‌కు చెందిన ఒక ముఖ్య నావికాదళ అధికారి ముంబయిలో ఉన్న తన భార్యతో మాట్లాడారు. అయితే భద్రతా కారణాల వల్ల ఆయన పేరు వెల్లడించలేదు. అపహరణకు గురైన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సముద్రపు దొంగలు నౌకను సముద్ర జలాల్లోనే వదిలివేసి సిబ్బందిని మాత్రమే అపహరించడం వెనుక కార‌ణం ఏమై ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News