ఆర్మీ వ‌ర్సెస్ పాలిటిక్స్‌!

Update: 2018-07-14 04:46 GMT
భారత ప్రజలు సైనికుల పై అత్యధిక విశ్వాసముంచారు. తమను రక్షించేది - కాపాడేది సైనికులేనంటూ వారికి అధిక ప్రాధాన్యమిచ్చారు. ఇక తమను ఏలుతున్నా రాజకీయ పార్టీలపై కనీస నమ్మకాన్ని కూడా  చూపించలేదు. "రాజకీయ పార్టీలు - ఎవరిపై  ప్రభావంతమైన విశ్వాసముంది" అనే అంశంపై రెండు సంస్ధలు నిర్వహించిన ఓ సర్వేలో ప్రజల అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఎనిమిది రాష్ట్రాలలో ఈ సంస్ధలు  తమ సర్వేలను నిర్వహించాయి. సర్వే జరిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ కూడా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా సైనికులకు మద్దతు తెలిపిన ప్రజలు రాజకీయ పార్టీలను మాత్రం ఏవగించుకున్నాయి. సైనికుల తర్వాత ప్రజలు విశ్వాసముంచింది సుప్రీం కోర్టు - హైకోర్టుల పైనే.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలలో ప్రజలకు రాజకీయ నాయకులపై  కనీస విశ్వాసం కూడా లేదు. ఆంధ్రప్రదే‌శ్ లో రాజకీయ పార్టీలపై - 24 శాతం మంది -  తెలంగాణలో -21 శాతం మాత్రమే విశ్వాసముందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీపై అసలు విశ్వాసమే లేదని తేల్చారు. ఈ సర్వేతో ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందో మరోసారి బహిర్గతమైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి - తెలుగుదేశం పార్టీలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోతోందని అనడానికి ఈ సర్వే తాజా ఉదాహరణ.

తెలుగు రాష్ట్రలైన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ లలో ఈ పరిస్దితికి కారణం అధికార పార్టీలే. ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ హామీలు గుప్పించిన ముఖ్యమంత్రులు చేతలలో మాత్రం ఏమీ చూపించడంలేదు. ఆంధ్రప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. రాష్ట్రానికి  ప్రత్యేక హోదా తీసుకువచ్చే అంశంలో ముఖ‌్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నాల్కల వైఖరి అవలంభించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల వరకూ హోదా కంటే ప్యాకేజీయే మేలంటూ నమ్మబలికిన ఆయన తాజాగా ప్రత్యేక హోదాపై నిరసన గళం ఎత్తారు. దీనిపై ప్రజలలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫలితాలే ఈ సర్వేలో బయటపడ్డాయి.

ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కూడా ప్రజలనుంచి వ్యతిరేకత ఎదుర్కోవడానికి ఆయన కుటుంబ పాలనే కారణంగా చెబుతున్నారు. రాష్ట్రంలో టిఆర్‌ ఎస్ ఎంఎల్‌ ఎలా అవినీతి నానాటికీ పెరుగుతోంది. దీంతో ఆ పార్టీపైనా - ప్రభుత్వం పైనా తీవ్ర వ్యతిరేకత వస్తోంది.  ఇక్కడకూడా సర్వేను ప్రభావితం చేసింది ఈ అంశాలే.

Tags:    

Similar News