మనోళ్లు; సత్యం.. శివం.. సుందరం

Update: 2015-08-12 06:02 GMT
నమ్మకపోవచ్చు కానీ.. ఏదైనా ప్రాశ్చాత్య దేశానికి చెందిన విదేశీయుడ్ని భారతదేశం గురించి అడిగితే అతగాడు చెప్పే మాట.. అక్కడ పాములు.. కోతులతో ఆడేవాళ్లు ఉంటారట కదా.. అదో పేద దేశం అని చెప్పే వాళ్లు కనిపిస్తారు. కానీ.. ఇదంతా పదేళ్ల క్రితం వరకూ ఉండేది. కానీ పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఎందరో భారతీయులు తమ సత్తాను చాటుకోవటమే కాదు.. దేశ ప్రతిష్టను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

సత్యం.. శివం.. సుందరం అన్న మాటకు ఈ డిజిటల్ యుగంలో.. అసలు సిసలైన సత్యం.. శివం.. సుందరం పేర్లు పెట్టుకొని తమ మేధస్సుతో దుమ్ము దులిపేయటం విశేషం. మైక్రోసాప్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల.. హెచ్ సీఎల్ గుండెకాయ శివ నాడార్.. గూగుల్ సీఈవోగా తాజాగా ఎంపికైన సుందర్ పిచ్చయ్ లు.. నయా సత్యం.. శివం.. సుందరంలుగా చెప్పొచ్చు.

నిజానికి ఈ ముగ్గురే కాదు.. ప్రపంచంలో భారత దేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తున్న వారు ఎందరో. నిజానికి ఈ అంశం మీద కొందరు చేసే వాదనలు విచిత్రంగా ఉంటాయి. దేశం విడిచిపెట్టి వెళ్లిన వారు ఎంత చేస్తేనేం అని మాట్లాడుతుంటారు. అలాంటి వారు మర్చిపోకూడనిది.. వారే దేశం నుంచి తీసుకెళ్లిన దాని కంటే దేశానికి వారు ఇచ్చిందే ఎక్కువ. దేశంలో ఉండి చేయొచ్చుగా అని మాట్లాడేవారు గుర్తుంచుకోవాల్సింది.. దేశానికి అది చేస్తాం.. ఇది చేస్తామనే వారు.. చేయటం తర్వాత.. ఏం చేస్తున్నారో తెలిసిందే.

అలాంటప్పుడు స్వశక్తితో ఎదిగి..తమ తెలివితేటలతో అత్యున్నత స్థానాలకు ఎదిగి.. భారతీయ సమాజానికి సరికొత్త స్ఫూర్తిదాతలుగా మారుతున్న వారిని అభినందిస్తే పోయేదేమీ ఉండదు.

నిజానికి ఈ ముగ్గురే కాదు.. మరికొందరు అంతర్జాతీయంగా కీలక స్థానాల్లో ఉన్న మనోళ్ల వివరాల్లోకి వెళితే..

నోకియా           రాజీవ్ సూరి

కాగ్నిజెంట్        ఫ్రాన్సిస్ డిసౌజా

మాస్టర్ కార్డ్       అజయ్ బంగా

అడోబ్ సిస్టమ్స్    శంతను నారాయణ్

పెప్సీకో             ఇంద్రానూయి

సాన్ డిస్క్         సంజయ్ మెహ్రాత్రా

గ్లోబల్ సిస్టమ్స్     సంజయ్ ఝూ

ఎల్ ఎస్ ఐ         అభిజిత్ తల్వాల్కర్

హర్మాన్ ఇంటర్నేషనల్   దినేశ్ పలివాల్
Tags:    

Similar News