దేశీయ తాజా టాప్ 10 కుబేరులు.. వారి సంపద లెక్క ఇదే

Update: 2022-03-17 03:28 GMT
ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసినప్పుడు.. భారతీయుల పేర్లు కనిపించటమే అదో గొప్పగా ఉండేది. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచ కుబేరుల టాప్ టెన్ లోకి ముకేశ్ అంబానీ పేరుతో మనోడు ఒకడు చోటు దక్కించుకున్నారు. అంతకంతకూ తన సంపదను పెంచేసుకుంటున్న ఆయనకు తీసిపోని రీతిలో.. పెద్ద ఎత్తున సంపన్నులు సంపదను క్రియేట్ చేస్తున్నారు.

ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకోవటంతో పాటు.. చాలా దేశాల్లోని కుబేరుల్ని సైతం తలదన్నేలా దూసుకెళుతున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

తాజాగా హురున్ గ్లోబల్ రిచ్ లిస్టు 2022 విడుదలైంది. దీని ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీ టాప్ 10లో తొమ్మిదో స్థానంలో నిలిస్తే.. గౌతమ్ అదానీ 12వ స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 69 వేధాల్లోని 2557 కంపెనీలకు చెందిన 3381 మంది బిలయనీర్లు ఈ జాబితాలో ఉన్నారు.

బిలియనీర్ల సంఖ్యలో చైనా అందరి కంటే ముందుంది. ఆ దేశానికి చెందిన 1133 మంది ఉంటే.. తర్వాతి స్థానం అమెరికాది. అగ్రరాజ్యానికి చెందిన 716 మంది కుబేరులకు జాబితాలో చోటు దక్కింది. ఆశ్చర్యకరంగా మూడో స్థానంలో భారత్ నిలిచింది.

మన దేశానికి చెందిన 215 మంది లక్ష్మీ పుత్రులకు చోటు దక్కింది. ఈ జాబితాలో చోటు దక్కాలంటే కనీసం ఒక బిలియన్ డాలర్ల సంపద ఉండాలి. అంటే.. మన రూపాయిల్లో చూస్తే. రూ.7500 కోట్ల సంపదన అన్న మాట.
ఐదేళ్ల క్రితం ప్రపంచ కుబేరుల్లో భారత్ వాటా 4.9 శాతం కాగా.. తాజాగా మాత్రం 8 శాతంగా ఉండటం గమనార్హం. ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న మనోళ్లలో టాప్ 100 మందిలో అంబానీ.. అదానీలు కాకుండా
ఇంకెవరు ఉన్నారంటే..

- సైరస్ పూనా వాలా
- లక్ష్మీ మిట్టల్
- రాధాకిషన్ దమానీ (డిమార్ట్)
- ఎస్ పీ హిందూజాలు(హిందూజా అధిపతి)
- ఫల్గుణి నాయర్ (నైకా వ్యవస్థాపకురాలు)

దేశీయంగా బిలియనీర్లు ఎక్కువగా ఉండే నగరాలుగా ముంబయి మొదటి స్థానంలో నిలిచింది. ఈ మహానగరంలో బిలియనీర్లు ఏకంగా 72 మంది ఉంటే.. తర్వాతి స్థానం దేశ రాజధాని ఢిల్లీ చోటు సంపాదించింది. ఈ నగరంలో 51 మంది ఉన్నారు. మూడో స్థానంలో బెంగళూరు నిలిచింది. ఈ నగరానికి చెందిన 28 మంది బిలియనీర్లుగా గుర్తింపు పొందారు.

దేశీయంగా టాప్ 10 కుబేరులు.. వారి సంపదను చూస్తే..

పేరు                                     సంపద (బిలియన్ డాలర్లలో)

ముకేశ్ అంబానీ                                103
గౌతమ్ అదానీ                                   81
శివ్ నాడార్                                       28
సైరస్ పూనావాలా                              26
లక్ష్మీ మిత్తల్                                     25
ఆర్కే దమానీ                                   23
ఎస్ పీ హిందూజా                             23
కేఎం బిర్లా                                      18
దిలీప్ సంఘ్వి                                 18
ఉదయ్ కొటక్                                 16
Tags:    

Similar News