ఇండో అమెరికన్లు ఎక్కువగా డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కే మద్దతిస్తున్నారని తాజా సర్వే వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్ పోటీ పడుతుండగా, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష స్థానంలోకి రావడానికి హిల్లరీ సరైన నేత అని, భారత్-అమెరికా సంబంధాలకు కూడా హిల్లరీ నాయకత్వమే మేలు చేస్తుందని ఇండో అమెరికన్లు భావిస్తున్నట్లు ఆన్ లైన్ సర్వే వెల్లడించింది.
మసాచుసెట్స్ కు చెందిన మీడియా పబ్లికేషన్స్ అండ్ యూఎస్ బిజినెస్ జర్నల్ - దాని అనుబంధ ఇండియా న్యూ ఇంగ్లండ్ న్యూస్ పబ్లికేషన్స్ అధ్యక్ష ఎన్నికలపై ఇండో-అమెరికన్ల అభిప్రాయంపై ఆన్ లైన్ లో సర్వే చేయగా.. 79.43 శాతం హిల్లరీకి ఓటు వేస్తామని, 14.98శాతం మాత్రమే ట్రంప్‌కు ఓటు వేస్తామని చెప్పారట. ఈ సర్వేను మూడో ప్రెసిడెన్షియల్ డిబేట్ అనంతరం అక్టోబరు 21 నుంచి 26వ తేదీ మధ్యలో చేశారు. ఎక్కువగా ఇండో-అమెరికన్ - దక్షిణాసియా పారిశ్రామికవేత్తలపై దృష్టిపెట్టినట్లు సర్వే తెలిపింది. అధ్యక్ష స్థానంలోకి ఎవరు వస్తే భారత్ కు మంచిది అనే అంశంపై ప్రశ్నించగా - 72.46శాతం హిల్లరీ రావాలని చెప్పగా - కేవలం 18.12 శాతం మా త్రమే ట్రంప్ అని చెప్పారట.
ఇదిలాఉండగా అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా తన ఇండో-అమెరికన్ మిత్రుడి కోసం ఓ అరుదైన పనిచేశారు. ఆయన ఓ వీడియో ప్రకటనలో కనిపించారు. చికాగో శివారులోని కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కు జరిగే ఎన్నికల్లో ఇండో అమెరికన్ రాజా కృష్ణమూర్తి అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయన తరఫున బరాక్ ఒబామా ప్రచారం చేపట్టారు. దీనిలో భాగంగా తయారు చేసిన ఓ వీడియో సందేశంలో ఆయన కనిపించి తన మిత్రుడు రాజా కృష్ణమూర్తికి ఓటువేసి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ సందేశంలో ఆయన కృష్ణమూర్తిని మంచి మిత్రుడిగా సంభోదించారు. 30 సెకన్ల ఈ వీడియోలో ఒబామా - కృష్ణమూర్తిలు కలిసి భారతీయ వంటకాలు తింటున్నట్లు చూపించారు. బరాక్ ఒబామా సెనేట్ కు ఎన్నికయ్యే సమయంలో ఆయనకు అమెరికా ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పిం చేందుకు కృష్ణమూర్తి కృషి చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/