అగ్రరాజ్యం అమెరికాకూ, దక్షిణాసియాలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న భారత్ కు ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికాకు ఎవరు అధ్యక్షుడైనా భారత్ తో అమెరికా సంబందాలు రోజు రోజుకీ మెరుగుపడుతూనే ఉన్నాయి! ఇక అమెరికాలో ఉన్న భారతీయుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! అమెరికాను రెండో మాతృదేశంగా భావించేవారూ ఈ క్రమంలో ఎక్కువే!! అయితే తాజాగా అమెరికాకు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న మైక్ పెన్స్ కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం!
అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న మైక్ పెన్స్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నాడు నల్లగొండకు చెందిన రాజు చింతల. అలా అని రాజు కు మైక్ పెన్స్ కూ మధ్య స్నేహం ఈమధ్య ఏర్పడింది అనుకునేరు... అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మైక్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఇండియానా గవర్నర్ గా అవతరించేవరకు కూడా రాజు చింతల తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. తాజాగా వాషింగ్టన్ లో కొలువు దీరనున్న కొత్త అమెరికా ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్న వారిలో రాజు చింతల కూడా ఒకరు!
ఈ సందర్భంగా భారత్ పట్ల అమెరికా వైఖరిపై రాజు చింతల స్పందించారు. దక్షిణాసియాలో భారత్ ను అత్యంత వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికా భావిస్తోందని చెప్పిన రాజు... ట్రంప్ ఆధ్వర్యంలో భారత్ - అమెరికా సంబంధాలు మరింత బలపడతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం విషయంలో ట్రంప్ భారత్ తో కలిసి ముందుకెళ్లాలని భావిస్తున్నారని, ఇదే క్రమంలో వాణిజ్యం, రక్షణ విభాగాల్లో కూడా భారత్ - అమెరికాలు మరింత స్నేహభావంతో ఉంటాయని అన్నారు. ఇదే క్రమంలో తన సన్నిహితుడు మైక్ పెన్స్ ఈ ఏడాదిలోనే భారత్ లో పర్యటించాలని అనుకుంటున్నారని రాజు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/