విమాన పైలెట్ మనోడే.. బదిలీ కోరిన నెలల్లోనే..

Update: 2018-10-29 12:10 GMT
ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం అందరినీ షాక్ కు గురిచేసింది.. ఈ లయన్ ఎయిర్ లెన్స్ విమానం జావా సముద్రంలో కుప్పకూలడంతో 188మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు.

ఈ ఘోర  ప్రమాదానికి గురైన విమానానికి పైలెట్ మన భారతీయుడే అన్న విషయం వెలుగులోకి వచ్చింది. అతడిని ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల భవ్యే సునేజాగా గుర్తించారు. సునేజా చాలా అనుభవం ఉన్న పైలెట్ గా ఆయన సన్నిహితులు - లయన్ ఎయిర్ లైన్స్ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన సునేజా 2011లో లయన్ ఎయిర్ సంస్థలో పైలెట్ గా చేరారు. ఎక్కువగా బోయింగ్ 737 విమానాలనే నడిపేవాడని సమాచారం. సునేజా పైలెట్ గా వ్యవహరించిన విమానం సముద్రంలో కూలిందని తెలియగానే ఢిల్లీలోని అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

అయితే సునేజా గత కొంతకాలంగా తన స్వస్థలం ఢిల్లీకి పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నాడని లయన్ ఎయిర్ అధికారులు తెలిపారు. అయితే మా సంస్థలో పనిచేసే పైలెట్లు అంతా ఉత్తర భారత్ కు చెందిన వారే కావడంతో సునేజా అభ్యర్థనను వెంటనే అంగీకరించలేకపోయామని.. ఏడాది తర్వాత ట్రాన్స్ ఫర్ చేస్తామని చెప్పామని తెలిపారు. అంతలోనే ఈ ప్రమాదం జరగడం విచారకరమని వివరించారు.


Tags:    

Similar News