ఐసోలేషన్ వేళ ఇండోనేసియన్లు అన్నేసి కోర్కెలు కోరారా?

Update: 2020-04-12 05:20 GMT
టూరిస్టు వీసాల మీద వచ్చి మతప్రచారానికి పూనుకోవటం చట్టప్రకారం నేరం. అలాంటి తప్పులకు పాల్పడటమే కాదు.. ప్రమాదకరమైన కరోనా వైరస్ వ్యాప్తికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కారణమైన ఇండోనేసియన్లు గాంధీలోని ఐసోలేషన్ వార్డుల్లో తమ కోర్కెల చిట్టా విషయంలో ఏ మాత్రం తగ్గలేదా? అంటే లేదనే మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా వెల్లడించటం విశేషం.

మర్కజ్ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన విదేశీయుల్లో.. తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం.. కరీంనగర్ లకు ఇండోనేషియన్లు రావటం.. వారి పుణ్యమా అని ఒక్కసారిగా కేసుల నమోదు భారీగా పెరగటమే కాదు.. మర్కజ్ లింకుతోనే తెలంగాణలో కేసులు భారీగా పెరిగాయన్నది మర్చిపోకూడదు.

కరోనా పాజిటివ్ అన్న విషయం తేలిన నేపథ్యంలో తెలంగాణలో గుర్తించిన ఇండోనేసియన్లు గాంధీ ఆసుపత్రికి తరలించారు. మొన్నామధ్య వరకు చికిత్స అందించి.. వారంతా నెగిటివ్ రిజల్ట్ వచ్చేలా చేశారు. కరోనా చికిత్స పొందే వేళ.. వారు పలు కోర్కెలు కోరినట్లుగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఇండోనేసియన్లు ల్యాప్ టాప్ లు.. ఐపాడ్ లు కావాలని కోరితే ఇచ్చామన్నారు.

చికెన్ కావాలన్నారని.. బ్రెడ్ లో తేనె కలుపుకొని తింటామని ఆ ఏర్పాట్లు చేశామన్నారు. ఇదంతా వారు రోగనిరోధక శక్తి పెరగటం కూడా ప్రయత్నిస్తే.. వారు కోరినట్లే అన్ని సౌకర్యాల్ని అందించినట్లుగా చెప్పారు. కరోనా పరీక్షల్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించాలన్న మీడియా ప్రతినిధుల మాటలతో కేసీఆర్ నోటి నుంచి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. కరోనా వేళలోనూ.. తమ కోర్కెల చిట్టాను అధికారుల ముందుంచి.. వాటన్నింటిని తీర్చుకునే వరకూ విశ్రమించని ఇండోనేసియన్ల బ్యాచ్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News