రోజులో చనిపోయే వారిలో ఎక్కువ శాతం మంది రోడ్డు ప్రమాదాల వల్లే చనిపోతున్నారు. మితిమీరిన వేగంతో కొందరు , ఇతరుల తప్పుల వల్ల కొందరు మృత్యు వాత పడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువమంది మరణిస్తున్నారనే కారణంతో ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు - రూల్స్ పెట్టినా - ట్రాఫిక్ చలానాల ఫీజులు విపరీతంగా పెంచినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావడంలేదు. ఎంతసేపూ వాటిని తప్పించుకోవడమెలా అని ఆలోచిస్తున్నారు తప్పితే - ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని ఎవరు అనుకోవడంలేదు. పోలీసులు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, అవేమి కూడా పెద్దగా ఉపయోగపడటంలేదు.
దీనితో నాకెందుకులే అనుకోని - ఒక యువతీ తన చుట్టపక్కల వారిని ట్రాఫిక్ నియమాలని పాటించేలా చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఇండోర్ కు చెందిన శుభీ జైన్ అనే యువతి పుణెలో ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. నడిరోడ్డుపై డాన్స్ చేస్తూ ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.
ఈ రోజుల్లో మనుషులకు మంచి ఎప్పుడూ మంచిగా చెబుతే ఎక్కదు కదా.. అందుకే ఆమె కొంచెం వెరైటీగా డ్యాన్స్ చేస్తూ చెప్తుంది. సిగ్నల్ పడగానే వాహనాల ముందుకు వచ్చి నమస్కారం చేసి సీట్ బెల్ట్ పట్టుకోండి - హెల్మెట్ పెట్టుకోండి అంటూ ఎంతో అందంగా వారికి డ్యాన్స్ రూపంలో తెలిపింది. దీంతో వాహనాదారులు వెంటనే సీట్ బెల్ట్ - హెల్మెట్ దరిస్తున్నారు.
తాను చేపట్టిన అవగాహన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణే లభిస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. గత 15 రోజులుగా స్వచ్ఛందంగా అవగాహన కార్యక్రమం చేపడుతున్నాని తెలిపింది. దేశం కోసం ఏదైనా చేయాలన్న తపనతో శుభీ జైన్ ఈ వినూత్న ఆలోచనకు నాంది పలికింది. సుభీ జైన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. ఈమె డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.