హెల్త్ హబ్ గా మారనున్న అమరావతి

Update: 2016-02-05 09:13 GMT
 నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి ఒక్క పునాది రాయి కూడా పడకపోయినా ప్రపంచం మాత్రం తన దృష్టిని ఇక్కడే కేంద్రీకరిస్తోంది. ఇప్పటికే విదేశాలకు చెందిన పలు ప్రతిష్ఠాత్మక విద్యా, సాంకేతిక సంస్థలు అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఇప్పుడు కొత్తగా వైద్య రంగం పరంగానూ అమరావతి ఆశల తీరంగా నిలుస్తోంది. తాజాగా రూ.వెయ్యి కోట్లతో సకల హంగులతో ఇండోయూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబుతో బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

కాగా దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ కు కూడా ఇప్పటికే ఏపీలో శంకుస్థాపన చేశారు. తాజాగా బ్రిటన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక ఆసుపత్రి రానుండడం గొప్ప విషయమే.  ఇండో యూకే ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, అధ్యయన సదుపాయాలను కూడా కల్పించనుంది.  ఇండో యూకే ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సొసైటీ భారతదేశంలో 11 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుచేయనుండగా.. వవాటన్నింటికీ ముఖ్య కేంద్రంగా అమరావతిలో ఆస్పత్రి ఉంటుంది. మొత్తానికి అమరావతి హెల్త్ హబ్ గా మారనుందన్నమాట.
Tags:    

Similar News