తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ కు బీజేపీ సవాళ్ల మీద సవాళ్లు విసురుతోంది. అయితే ఆ సవాళ్లకు గులాబీ శిబిరం పెద్దగా స్పందింస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో బీజేపీలో ఒకప్పుడు కీలక నేతగా వ్యవహరించి గత కొంతకాలంగా అస్సలు కనిపించకుండా పోయిన నల్లు ఇంద్రసేనారెడ్డి ఇప్పుడు సరికొత్త శక్తులు కూడదీసుకుని ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు - ఆయన కుమారుడు కేటీఆర్ లను నేరుగా టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు త్వరలో బీజేపీలో చేరబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంద్రసేనారెడ్డి... దమ్ముంటే కేసీఆర్ వారిని నిలువరించి చూపాలని సవాల్ విసిరారు.
ఈ నెల 18న హైదరాబాద్ లో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు జాతీయ స్థాయి కీలక నేతలు కూడా హాజరు కానున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా కమలదళం చాలా పకడ్బందీగానే ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 18న భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలోనే ఇటు కాంగ్రెస్, టీ టీడీపీకి చెందిన నేతలతో పాటు టీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు కూడా బీజేపీలో చేరనున్నారట. ఇదే మాటను వినిపించిన ఇంద్రసేనారెడ్డి... తెలంగాణలో అధికార పార్టీకి పెను సవాలే విసిరారన్న వాదన వినిపిస్తోంది.
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో సింగిల్ గానే బరిలోకి దిగిన బీజేపీ ఏకంగా నాలుగు సీట్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ నాలుగు సీట్లలో కేసీఆర్ కూతురు ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ సీటు కూడా ఉంది. కవితను ఓడించి మరీ బీజేపీ ఈ సీటును దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అన్న దిశగా సాగుతుండగా... నాలుగు సీట్లు గెలిచినంతనే విర్రవీగుతున్నారంటూ గులాబీ శిబిరం బీజేపీపై సెటైర్లు వేసింది. ఈ సెటైర్లను కూడా ప్రస్తావించిన ఇంద్రసేనారెడ్డి... అధికార పార్టీ అధినేతే కాకుండా సీఎం అయిన తండ్రి ఓ వైపు, పార్టీ కార్యాధ్యక్షుడిగా సోదరుడు ఓ వైపు నిలబడ్డా కవిత ఎందుకు ఓడిపోయిందో చెప్పాలంటూ ఇంద్రసేనారెడ్డి విరుచుకుపడ్డారు.
టీఆర్ఎస్ అరాచకాలకు చరమ గీతం పాడే క్రమంతోనే తెలంగాణ జనం కవితను ఓడించారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్రెస్ గల్లంతేనని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను నేరుగానే టార్గెట్ చేసిన ఇంద్రసేనారెడ్డి... ఆగస్టు 15 తర్వాత టీఆర్ఎస్ పాలన ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పిన కేసీఆర్... గడచిన ఆరేళ్ల పాటు గాడిద పళ్లు తోమారా? అంటూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంద్రసేనారెడ్డి విసిరిన సవాళ్లు, చేసిన వ్యాఖ్యలకు గులాబీ దళం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.